ఆంధ్రప్రదేశ్‌

ప్రజలతో అడుగుకలిపిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లకూరు, జనవరి 23: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగళవారం ఉదయం జిల్లా పరిథిలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామానికి ప్రవేశించింది. జిల్లా నుండి పార్టీ అగ్రనాయకులు నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపి వరప్రసాదరావు, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, కిలివేటి సంజీవయ్యలతో పాటు కేడరంతా పునబాక గ్రామానికి విచ్చేసి జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌కు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జగన్ తన పాదయాత్రను పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలతో కలసి పునబాక గిరిజన కాలనీ నుండి ప్రారంభించారు. దారి పొడవునా మహిళలు జగన్‌కు హారతులు పట్టి ఆశీర్వచనాలు పలికారు. యాత్రలో భాగంగా జగన్ పునబాక దళిత, ఎస్టీకాలనీ, అర్ధమాల క్రాస్ రోడ్డు, చెంబేడు, సిఎన్ పేటల కూడళ్ల వద్ద ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అమలుకు వీలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. తనను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తే 45 ఏళ్లకే పించన్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ప్రతి విద్యార్థికి ఫీజురీయింబర్స్ మెంట్ సహా ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కల్పిస్తానని హామీఇచ్చారు. సాయంత్రం ఐదుగంటలకు ఈ పాదయాత్ర చెన్నప నాయుడు పేట హరిజన వాడ వద్ద ముగిసింది.
చిత్రం..నెల్లూరు జిల్లా పెళ్లకూరు వద్ద ప్రజలతో కలిసి అడుగువేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్