ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థుల మేధస్సుకు పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 24: నవ్యాంధ్రను నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్‌లో అత్యుత్తమ ఫలితాలు అందిస్తాయని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పరిధిలో యూనివర్శిటీల విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలను ప్రోధి చేసుకునేది కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు పనిచేయాలన్నారు.
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం గత 43 నెలల కాలంలో విద్యా రంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టారన్నారు. ఉన్నత విద్య ఎంతో కీలకమని, యువతను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు మంచి తరుణమన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తే అది దేశ ప్రగతికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియకు కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని, ఆన్‌లైన్ విధానంలో విద్యా బోధనకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఏపీ నుంచి 16 యూనివర్శిటీలు పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో కనీసం నాలుగు యూనివర్శిటీలు జాతీయ స్థాయిలో స్థానం దక్కించుకునే విధంగా పనితీరు ప్రదర్శించాలన్నారు.
పెందుర్తి: ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతో ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం గ్రామాన్ని బుధవారం సందర్శించిన ఆయన గ్రామంలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. గ్రామీణ ప్రాంతమైనప్పటికీ పట్టణాలతో సమానంగా అభివృద్ధిని సాధించిందంటే అందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలే కొలమానమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జరుగుతున్న కార్యక్రమాలు ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నాయన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అనతికాలంలోనే ఇంతటి అభివృద్ధి సాధించడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని కొనియాడాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్భ్రావృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రూ.512 కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.