ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి నాలుగేళ్ల క్రితమే ‘చంద్ర’గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, జనవరి 31: రాష్ట్రానికి నాలుగేళ్ల క్రితమే చంద్రగ్రహణం పట్టిందని, నేడు పట్టిన గ్రహణం కొన్ని గంటల్లో తొలగిపోతుందని, రాష్ట్రాన్ని పట్టింది వీడేందుకు ఇంకా ఏడాది సమయం ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. బుధవారంనాడు పొదలకూరుకు వచ్చిన ఆయన స్థానిక పంచాయతీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ గ్రహణాన్ని వదిలించేందుకు యువత సైనికుల్లా సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. గత నాలుగేళ్లకాలంలో అవినీతి పెరిగిపోయిందని దుయ్యబట్టారు. చంద్రబాబు విదేశాలకు వెళ్తే ఆ సీటులో బాలకృష్ణ ఆశీనులవుతాడని విమర్శించారు. సాధారణ పూజలు జరగాల్సిన దుర్గమ్మ గుడిలో తాంత్రిక, మాంత్రిక పూజలు కూడా జరగడం శోచనీయమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తున్నారన్నారు. వారికి మంత్రి పదవులు కట్టబెడుతుండటం అమానుషమన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన చంద్రబాబు తూట్లు పొడుస్తుండటం శోచనీయమన్నారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార పిచ్చికి 29 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తనపై అభియోగాల నుంచి ప్రజలను మళ్లించేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఉద్యోగులకు ఐదువేల కోట్ల రూపాయల వరకు బకాయి ఉన్నాడన్నారు. రెండు డిఏలు కూడా ఇవ్వాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు చంద్రబాబు ప్రతి ఇంటికీ కిలో బంగారం ఇస్తామని ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జాబు ఉండాలంటే బాబు పోవాల్సిన అవసరం ఉందన్నారు. కండలేరు ఎడమగట్టుకాలువపై శాశ్వత ఎత్తిపోతల పథకం మంజూరుకు దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారన్నారు.మూడు చోట్ల కుటుంబ వినోద కేంద్రాలుఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 31: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో భారీస్థాయి కుటుంబ వినోద కేంద్రాల (ఎఫ్‌ఈసీ) ఏర్పాటును పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాదించారు. సచివాలయం ఆర్థిక శాఖ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన పట్టణాభివృద్ధి విధానాల సంస్కరణపై మంత్రిమండలి ఉప సంఘం సమావేశం, పర్యాటక శాఖ అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ప్రతిపాదించిన మూడు ఎఫ్‌ఈసీలు కాకినాడలో రిసార్ట్, ప్రకాశం జిల్లా చీరాలలోని ఓడరేవు సమీపంలో రిసార్ట్ గురించి పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. విశాఖ ఎఫ్‌ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్ 8 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్థ్యం గల ఒక కాన్ఫరెన్స్ హాల్, 50 వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్ ఉంటాయని తెలిపారు. విజయవాడలోని ఎఫ్‌ఈసీలో ఒక ఐమాక్స్ థియేటర్, 6 వెండితెరల మల్టీప్లెక్స్, రెండు వేల సీట్ల సామర్థ్యం గల ఎంఐసీఈ, 80 వేల అడుగుల వాణిజ్య స్థలం, త్రీస్టార్ హోటల్ ఉంటాయని వివరించారు. కాకినాడలో మొత్తం పది ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్ ఏర్పాటు చేసి అక్కడ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టులకు వంద నుంచి 150 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పర్యాటక శాఖకు సంబంధించి మూడు కేటగిరీలుగా విభజించిన 9 అంశాలను పర్యాటక శాఖ కమిషనర్ హిమాన్షు శుక్లా వివరించారు.ఈ సందర్భంగా మంత్రి రామకృష్ణుడు మాట్లాడుతూ ఏ ప్రాజెక్టులైనా నిర్ణయించిన సమయానికి పూర్తి కాకపోతే వారికి ఇచ్చిన భూములను తప్పనిసరిగా వెనక్కు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో ఏవైనా ప్రాజెక్టులు గిరిజనేతరులు చేపట్టడానికి నిబంధనలు అనుమతించనందువల్ల ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఏపీ టూరిజం బోర్డు ఏర్పాటు, మహేంద్ర సంస్థకు శ్రీకాకుళంలో స్థలం కేటాయింపు, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పర్యాటక ప్రాజెక్ట్, అక్కడి ఐల్యాండ్, పలు పర్యాటక ప్రాజెక్టులు, ఏపీటీడీసీ ప్రాజెక్టులు, అరవసల్లి, కుప్పం, తొట్లకొండ, ఎర్రకాలువ భూముల కేటాయింపు తదితర పలు అంశాలను చర్చించారు.