ఆంధ్రప్రదేశ్‌

హరీష్ ఆత్మహత్యతో ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జనవరి 31: ఇప్పటి వరకూ ఎంతో ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలు ఇప్పుడు అట్టుడికిపోతున్నాయి. రెండురోజుల కిందట జరిగిన ఒక సంఘటనలో స్వీట్ షాప్‌లో పని చేసే కుర్రాడు ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ అకారణంగా స్వీట్ షాప్‌లో పని చేసే హరీష్‌ను చితక బాదడంతో అతడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుంది. బుధవారం పోలీసులు జంట పట్టణాలను దిగ్బంధం చేశారు. ఘటద ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తడంతో ప్రజల స్పందన చూసి పోలీసులు కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి నెలకొంది.