ఆంధ్రప్రదేశ్‌

ఆలయాల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 31: చంద్రగ్రహణం కారణంగా బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేశామని, రాత్రి 9.30 గంటల తరువాత సంప్రోక్షణ అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించామని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 11గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేశామన్నారు. రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు పూర్తయిన అనంతరం భక్తులకు సర్వదర్శనంకు అనుమతించామన్నారు. అన్నప్రసాదాల వితరణ లేని కారణంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను అనుమతించలేదన్నారు. ఇదిలావుండగా చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కాళహస్తిలో భక్తుల రద్దీ పెరిగింది. చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేస్తుండగా రాహు-కేతు క్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వరాలయంలో మాత్రం స్వామి దర్శనం యథావిధిగా కొనసాగింది. భక్తుల రద్దీ పెరిగింది. గ్రహణం సందర్భంగా స్వామి,అమ్మవార్లను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. గ్రహణం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు ఆలయానికి వచ్చారు. రాహు-కేతు పూజలు కూడా చేయించుకున్నారు.
భద్రాద్రి, .విజయవాడ దుర్గగుడి
విజయవాడ/్భద్రాచలం: చంద్ర గ్రహణం సందర్భంగా బుధవారం విజయవాడలోని కనకదుర్గ ఆలయం, భద్రాచలంలోని రామాలయాలను మూసివేశారు. ఉదయం సుమారు 10-30గంటలకు ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని ఆలయాధికారులు మూసేసారు. గ్రహణం సందర్భంగా ఆలయ ఈవో ఎం. పద్మ ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు వేకువ జామునుంచే వివిధ రకాలైన ప్రత్యేక పూజలు, అర్చనలు, తదితర వాటిని నిర్వహించి తర్వాత ఆలయానికి మూసివేశారు. గురువారం వేకువ జామున ఆలయ స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవార్లకు సంప్రోక్షణ, స్నపనాభిషేకం, విశేష పూజలు, తదితర వాటిని నిర్వహించిన తర్వాత ఉదయం సుమారు 8-30 గంటల నుండి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ తలుపులకు తాళం వేశారు. రాత్రి 9.15 గంటలకు గ్రహణం వీడనుండటంతో అనంతరం ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి భక్తులకు సాధారణ రీతిలో దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.