ఆంధ్రప్రదేశ్‌

సచివాలయమే ముందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 31: రాజధానిలోని పాలనా నగరంలో తొలుత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలు, ప్రభుత్వ ఆవాసాలను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. పరిపాలన నగరంలో చేపట్టే అన్ని నిర్మాణాల్లో మొదటి ప్రాధాన్యంగా ఈ మూడు ప్రాజెక్టులను పూర్తిచేసి వచ్చే ఏడాదిలోనే వినియోగంలోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారులు తెలియజేశారు. సచివాలయంలో బుధవారం జరిగిన రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశంలో రాజధానిలో చేపట్టిన రహదారులు, పరిపాలన నగర శాశ్వత భవంతుల నిర్మాణాలు తదితర అంశాలతో పాటు, మెరీనా, ఐటీ టవర్లు, హెల్త్ స్ట్రీట్, కంటైనర్ హోటళ్లు వంటి ఎకనమిక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అమరావతిలో వచ్చే ఏప్రిల్‌లో జరగనున్న సంతోష నగరాల సదస్సు, 9 మాసాలలో పూర్తి చేయాల్సివున్న ఇంటెరిమ్ హైకోర్టు నిర్మాణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం, శాఖాధిపతుల భవంతుల నిర్మాణ ప్రణాళికలను నార్మన్ ఫోస్టర్ సంస్థ బుధవారం రాత్రిలోగా తమకు పంపుతున్నట్టు తెలియచేసిందని, వీటికి మార్చిలోగా టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషన్ చెరుకూరి శ్రీ్ధర్ వివరించారు. హైకోర్టు భవంతి ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలు ఫిబ్రవరి 4 లేదా 5వ తేదీలోగా రానున్నాయని తెలిపారు. శాసనసభ భవంతి ఆకృతులు మరో రెండు వారాలలో వస్తాయని చెప్పారు. వచ్చే అక్టోబర్ నాటికి ప్రభుత్వ ఆవాసాలు మొత్తం సిద్ధం కానున్నాయని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. మొత్తం పది పదేశాలలో 69 టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్టు తెలిపారు. శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్ అధికారులకు 18 టవర్లలో 144 ప్లాట్లు, ఎన్జీవోలకు 22 టవర్లలో 1968 ప్లాట్లు, టైప్ 1,2 అధికారులు, గ్రూప్ ‘డి’ ఉద్యోగులకు 21 టవర్లలో 1440 ప్లాట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. వీటిన్నింటికీ రాఫ్ట్ స్లాబ్ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం నిర్మించే రెసిడెన్షియల్ టవర్స్ అన్నింటిలో క్లబ్ హౌస్‌తో పాటు ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఐటీ స్పేస్ కోసం 2 టవర్లు
అమరావతిలో ఐటీ కంపెనీల కోసం ఆఫీస్ స్పేస్ నిర్మాణాలను చేపట్టడానికి సీఆర్‌డీఏ ప్రతిపాదనలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి ముందుంచింది. ముందుగా సీఆర్‌డీఏ ఈ ప్రాజెక్టును చేపడుతుంది. తరువాత చేపట్టే నిర్మాణాలను అభివృద్ధిదారుకు అప్పగిస్తారు. ప్రభుత్వం రూపొందించిన ఐటీ పాలసీకి అనుగుణంగా వీటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. తొలుత 10 లక్షల చదరపు అడుగుల మేర జంట భవంతుల నిర్మాణాన్ని చేపడతారు. ఐటీ టవర్లలో మొదటి దశ నిర్మాణాన్ని 12 మాసాలలో, రెండవ దశను 24 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ కానె్సప్ట్‌తో వీటిని నిర్మించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. సీఆర్‌డీఏ నిర్మిస్తున్న ఆఫీస్ స్పేస్‌ను విక్రయించడం ద్వారా చదరపు అడుగుకు రూ.3వేల వంతున ధర రావచ్చునని అంచనా వేశారు. మొత్తం రూ.90.6 కోట్ల ఆదాయం సమకూరవచ్చునని భావిస్తున్నారు.
తాత్కాలిక హైకోర్టు భవనం
తాత్కాలిక హైకోర్టు భవంతి నిర్మాణ ప్రణాళికపై ఈ సమావేశంలో సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. 4 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం జరగనున్నది. 1.8 లక్షల చదరపు అడుగులలో గ్రాస్ ఫ్లోర్ ఏరియా ఉంటుంది. జీ ప్లస్ 2 పద్ధతిలో భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రధాన న్యాయమూర్తి కోసం 2000 చదరపు అడుగులలో కోర్టు రూమ్, 1200 చదరపుఅడుగుల విస్తీర్ణంలో ఛాంబర్ నిర్మిస్తారు. మరో 1000 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో 18 కోర్టు హాళ్లు, 600 చదరపు అడుగుల చొప్పున న్యాయమూర్తుల ఛాంబర్లు ఉంటాయి. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణానికి రూ.108 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు. 6 నుంచి 8 మాసాల వ్యవధిలో మొత్తం నిర్మాణం పూర్తి చేస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు.
అమరావతి నగర నిర్మాణం ఇక వేగం పుంజుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. సీఆర్‌డీఏ పరిధిలో చిన్నచిన్న పనులకు కూడా కాలయాపన జరుగుతుందని, ఇక మీదట అలా జరగరాదని చెప్పారు. అమరావతిలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎతె్తైన కొండపై 108 అడుగుల ఎత్తున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై అధికారులు ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 6 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి మెరీనా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలించారు. బోట్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, సెయిలింగ్ ట్రైనింగ్ సెంటర్, పవర్ బోటింగ్, ఫుట్ కోర్టు, కనె్వన్షన్ సెంటర్ వంటి సదుపాయాలతో మెరీనా ఏర్పాటు చేస్తారు.