ఆంధ్రప్రదేశ్‌

ముగ్గురూ ముగ్గురే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 31: రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన పశ్చిమ గోదావరి జిల్లా నుండి రాష్ట్ర క్యాబినెట్‌లో ముగ్గురు మంత్రులున్నా ఎవరికి వారుగా వ్యవహరిస్తూ, నిమిత్తమాత్రులుగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా బిజెపి నుంచి ఎన్నికైన పైడికొండల మాణిక్యాలరావుదేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రిగా, టిడిపి నుంచి పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా, కెఎస్ జవహర్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా రాష్ట్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా వారి వారి నియోజకవర్గాలకు పరిమితం కావడం మినహా సంయుక్తంగా జిల్లాకు సాధిస్తున్న మేళ్లేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రాజకీయపరంగా చూస్తే 2014 ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలూ టీడీపీ-బీజేపీ కూటమి గెల్చుకుంది. ఈ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తూ తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై అవ్యాజమైన అభిమానం కురిపిస్తుంటారు. అందుకు తగినట్టుగానే కేబినెట్‌లో జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు లభించడంతో జిల్లాపై వరాల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. కాని అలాంటి పరిస్థితి ఇప్పటివరకూ కన్పించలేదంటే ఆతిశయోక్తికాదు. జిల్లాలో రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం అవుతుండటంతోపాటు అప్పట్లో అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన పలు హామీలు అలాగే ఉన్నాయి. వీటిపై దృష్టిపెట్టి జిల్లా అభివృద్ధిలో క్రియాశీలకపాత్ర పోషించాల్సిన అమాత్యులు ఎవరికివారుగా ఉండిపోయారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
ముగ్గురు మంత్రులు అయితే అమరావతికి, లేదంటే వారి వారి నియోజకవర్గాలకు పరిమితం అయిపోతున్నారని విపక్షాలు విమర్శించే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు ఒక్క అధికారిక సమావేశంలోనూ సంయుక్తంగా పాల్గొన్న దాఖలాలు దాదాపుగా లేకపోవడం విశేషం.
ప్రధానంగా పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి ఎన్నికైన మాణిక్యాలరావు దేవదాయశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా పర్యటనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించిన జాడేలేదు. దీనికితోడు సొంత నియోజకవర్గంలో మిత్రపక్షం టీడీపీతో ఉన్న ఇంటిపోరుతోనే ఆయన సతమతమవుతున్నారనే వ్యాఖ్యలూ లేకపోలేదు. ఇక సీనియర్ మంత్రి పితాని సత్యనారాయణ కార్మికశాఖ అమాత్యులుగా కొనసాగుతున్నారు. సహజంగానే ఆయన జిల్లాకు సంబంధించి పూర్తిస్ధాయి పట్టు కొనసాగిస్తారన్న ప్రచారం తొలిదశలో సాగినా తొలినాళ్లలో జిల్లా కలెక్టరుపై కొన్ని వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత ఒకటి, రెండు సమావేశాల్లో కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానాలు విన్పించటం మినహా పరిపాలనాపరంగా ఆయన ప్రభావం అంతగా కనపడలేదనే చెప్పాలి. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ జూనియర్ అయినప్పటికీ కొంతవరకు తనదైన శైలిలో తిరుగుతూనే ఉన్నా ఆయన అధికభాగం అమరావతికి పరిమితం కావటం, ఉన్న కొద్దిసమయం నియోజకవర్గానికి పరిమితమవుతున్నారు. కీలకమైన దినోత్సవాలు, రాష్ట్ర కార్యక్రమాలు ఉన్నప్పుడు జిల్లా కేంద్రానికి రావటం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ముగ్గురు మంత్రులున్నా దాదాపుగా ఎవరికివారుగానే వ్యవహారం సాగిపోతోంది. గతంలో ఈస్ధాయిలో మంత్రిపదవులు దక్కినప్పుడు జిల్లాలో కీలకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రతి దశలోనూ మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పెండింగ్‌లో పడుతున్న కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లటంలో తమవంతు కృషిచేస్తుండేవారు.
ఈ విషయంలో కాంగ్రెస్ హయాంలో సీనియర్ నేత చేగొండి వెంకట హరిరామ జోగయ్య, తెలుగుదేశం హయాంలో దివంగత నేత కోటగిరి విద్యాధరరావు జిల్లాపై ఆవిధంగా చెరగనిముద్ర వేశారనే చెప్పాలి. జిల్లా వ్యవహారాలను వీరు ఒంటిచేత్తో నడిపించేవారనడం అతిశయోక్తికాదు. కోటగిరికి సహచరులుగా జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన కొత్తపల్లి సుబ్బారాయుడు, దండు శివరామరాజు సైతం అధికారిక సమావేశాల వేదికలను పంచుకుని, పథకాల తీరును సమీక్షించడం, అధికార్ల తీరును ఎండగట్టడం వంటి చర్యలు తీసుకునేవారు.ఇక వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లోమంత్రిగా పనిచేసిన వట్టి వసంతకుమార్ కూడా తనకున్న అవగాహన, జిల్లాపై ఉన్న పట్టుతో పరిపాలనాపరంగా ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా రాజకీయంగాను తన హవాను కొనసాగించారు. అయితే అలాంటి పరిస్ధితి ఇప్పుడు కన్పించకపోవటం విడ్డూరంగానే ఉంది. ప్రస్తుత మంత్రుల్లో సీనియర్‌గా పేరొందిన పితాని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలోనూ మంత్రిగా పనిచేసినా ప్రస్తుతం ఎందుకో స్తబ్దుగా ఉండిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.