ఆంధ్రప్రదేశ్‌

ఆయనే పెద్ద కమర్షియల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 31: రాష్ట్రంలో మరో అవినీతి అధికారి ఏసీబీకి దొరికాడు. వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్‌గా పనిచేస్తున్న గెడ్డపు లక్ష్మీప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఫిర్యాదులు రావడంతో ఏసీబీ విశాఖ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో రాష్ట్రంలో 20 చోట్ల బుధవారం ఏక కాలంలో దాడులు జరిగాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు, హైదరాబాద్‌లోని ఈ దాడులు జరిగాయి. విశాఖలోని లక్ష్మీ ప్రసాద్ బావమరిది ఇంట్లో కూడా బుధవారం దాడులు జరిగాయి. ఏసీబీ అధికారుల కళ్లు చెదిరేలా లక్షీప్రసాద్ ఆస్తులు ఉన్నాయి. వాణిజ్యపన్నుల శాఖలో అత్యున్నత అధికారి ఏసీబీ అధికారులకు చిక్కడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. దీంతో రాష్ట్రంలోని వాణిజ్యపన్నుల శాఖలో కలకలం మొదలైంది. లక్ష్మీ ప్రసాద్ అక్రమార్జనకు సంబంధించి ఏసీబీ అధికారులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం పట్టణంలో ఏడు వేల ఎస్‌ఎఫ్‌టీతో కూడిన జీ ప్లస్ టు భవనాన్ని 2003-04లో కొనుగోలు చేశారు. గుంటూరు జిల్లా గోరంట్లలో 400 చదరపు గజాల స్థలాన్ని 1997లోనే కొనుగోలు చేశాడు. ఇక్కడే 889 చదరపు గజలా ఇంటి స్థలాన్ని 1993లో కొనుగోలు చేశాడు. ఇక్కడే 240 చదరపు గజాల ఇంటి స్థలాన్ని 2014లో లక్ష్మీ ప్రసాద్ కొనుగోలు చేశాడు. విశాఖ నగరంలోని 200 చదరపు గజాల స్థలం, రంగారెడ్డి జిల్లా పరిగిలో 200 చదరపు గజాల చొప్పున నాలుగు స్థలాలను 2009 నుంచి 2011 సంవత్సరాల మధ్య కొనుగోలు చేశాడు. గుంటూరు జిల్లా లాంలో 172 చదరపు గజాల ఇంటి స్థలం, తాడికొండలో 400 చదరపు గజాల చొప్పున రెండు ఇంటి స్థలాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో1485 ఎస్‌ఎఫ్‌టీ కలిగిన ఒక ఫ్లాట్, నారాయణగుడలోని 1594 ఎస్‌ఎఫ్‌టీ కలిగిన మరొక ఫ్లాట్, గచ్చిబౌలిలోని 2040 ఎస్‌ఎఫ్‌టీ కలిగిన ఇంకో ఫ్లాట్‌ను లక్ష్మీ ప్రసాద్ కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలియచేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 2.14 ఎకరాల డ్రై ల్యాండ్, విశాఖ జిల్లా అచ్యుతాపురంలో 0.17 సెంట్ల ఖాళీ స్థలాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని 2013లో లక్ష్మీ ప్రసాద్ సొంతం చేసుకున్నాడు. లక్ష్మీప్రసాద్ అతని మరదలు పేరిటి మహేశ్వరంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి, గుంటూరు జిల్లా గోరంట్లలో 222 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఇక లక్ష్మీ ప్రసాద్‌కు చెందిన బంధువులు, స్నేహితులు ఇళ్ళపై దాడులు నిర్వహించగా కోటి రూపాయల విలువైన ప్రాంసరీ నోట్లు, 34 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 32 వేల రూపాయల నగదు, 40 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు, 10 లక్షల విలువైన గృహోపకరణాల,
రెండు మారుతీ కార్లు, ఒక ఎకోస్పోర్ట్స్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించి ఆరు కోట్ల రూపాయల అక్రమాస్తులు వెలుగు చూశాయని ఏసీబీ అధికారులు చెపుతున్నారు. మార్కెట్ ధరతో పోల్చి చూస్తే 60 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది.
లక్ష్మీప్రసాద్ ప్రస్తుతం విజవాయడలోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో చీఫ్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రసాద్‌ను అరెస్ట్ చేసి విశాఖకు తీసుకువస్తున్నామని కేసు దర్యాప్తు జరుపుతున్న విశాఖ రేంజ్ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ వెల్లడించారు. గురువారం అతనిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు రామకృష్ణ ప్రసాద్ వ్లెలడించారు.