ఆంధ్రప్రదేశ్‌

కోడి పందేలరాయుళ్లకు జైలుశిక్ష - నిడదవోలు కోర్టు సంచలన తీర్పు -

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, జనవరి 31: సంక్రాంతి పర్వదినాల్లో చట్టవిరుద్ధంగా కోడి పందేల్లో పాల్గొన్న 95మంది కోడి పందేలరాయుళ్లకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు అదనపు జూనియర్ సివిల్ జడ్జి వై శ్రీలక్ష్మి బుధవారం తీర్పుచెప్పారు. నిందితులకు మూడు రోజులు సాధారణ జైలుశిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. వివరాలిలావున్నాయి...సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించరాదని, కోళ్లకు కత్తులు కట్టి హింసించరాదని, ఇటువంటి చర్యలకు పాల్పడితే శిక్షార్హులని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే పందెంరాయుళ్లు వీటిని ఖాతరు చేయకుండా పందేలు యథేచ్ఛగా నిర్వహించారు. ఈ పందేలకు సంబంధించి నిడదవోలు పోలీసు సర్కిల్ పరిధిలో 95 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. వారందరినీ బుధవారం నిడదవోలు కోర్టుకు తరలించగా మూడు రోజులు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. సాధారణంగా కోడిపందేల కేసుల్లో వందో రెండొందలో జరిమానా చెల్లించేసి వెళ్లిపోవచ్చని అంతా భావిస్తుంటారు. అనూహ్యంగా జైలు శిక్ష విధించడంతో వారంతా లబోదిబోమన్నారు. తీర్పు అనంతరం దీనితో నిందితులను రెండు ఆర్టీసీ బస్సుల్లో తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు సబ్ జైళ్లకు తరలించారు.

‘అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ బాబు’

అమరావతి, జనవరి 31: అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అయితే అరాచకానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ బ్రాండ్ అంబాసిడర్‌లా మారారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ ఎద్దేవా చేశారు. ఈడీ కేసులు, ఆస్తుల అటాచ్‌మెంట్, జైలు జీవితం అనుభవించిన జగన్ వెంట ప్రజలు నడవాలా అని ఆయన ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో దినకర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలను చేర్చాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారం సగటున 6.5 శాతం భారతదేశ వృద్ధి నమోదవుతుంటే దీనికి దాదాపు రెండు రెట్లు అనగా 12 నుంచి 13 శాతం వరకు ఏపీలో నమోదవుతుందన్నారు. ఒక వైపు గడచిన 4 సంవత్సరాలను భారతదేశ వృద్ధిరేటు వివిధ రంగాల్లో క్షీణిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు దేశానికే తలమానికంగా ఉందని గుర్తు చేశారు. నోట్ల రద్దు, జీఎస్‌టీకి సంబంధించిన అంశాలు దేశ ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపించాయనీ, అసంఘటిత రంగాల్లో అధికార లెక్కల ప్రకారం దాదాపు 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు.

నిరుద్యోగులతో సర్కార్ చెలగాటం

విజయవాడ, జనవరి 31: శుష్క వాగ్దానాలు, శూన్యహస్తాలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడడం శోచనీయమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్.తులసీ రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య తగ్గుతుండగా భారత్‌లో పెరుగుతోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 2017లో 19.27 కోట్లు కాగా 2018లో 19.23 కోట్లు ఉంటోందని ఐఎల్‌ఓ చెప్పిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం యువత కోసం తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలను గాలికొదిలేసిందన్నారు. ఉద్యోగ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటికొక ఉద్యోగం ఇస్తారా అంటే ఆ ఊసే లేదన్నారు.

మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు షెడ్యూల్

విజయవాడ, జనవరి 31: రాష్ట్రంలోని మున్సిపల్ ఉపాధ్యాయులకు తాజాగా పదోన్నతుల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5 నుండి 7వ తేదీ వరకు సీనియార్టీ జాబితాల తయారీ, 8 నుండి 14వ తేదీ వరకు సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాలు, 15 నుండి 16వ తేదీ వరకు అభ్యంతరాల పరిష్కారం, 17 నుండి 20వ తేదీ వరకు ప్యానల్ కమిటీ మీటింగ్, 21 నుండి 24వ తేదీ వరకు ప్రమోషన్స్ కౌన్సిలింగ్ నిర్వహణ, 25 నుండి 26వ తేదీ వరకు ఉత్తర్వులు జారీ ప్రక్రియ ఎట్టకేలకు షెడ్యూల్ విడుదల పట్ల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం హర్షం వెలిబుచ్చారు