ఆంధ్రప్రదేశ్‌

పంటల ధ్వంసానికి యత్నం..ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం/జీలుగుమిల్లి, జనవరి 31: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి సేకరించిన భూముల్లో సాగుచేస్తున్న పంటలను ధ్వంసం చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలను రైతులు అడ్డుకోవడంతో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో సాగుచేస్తున్న పొగాకు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలను రైతులు, రైతుకూలీలు అడ్డుకున్నారు. దీనితో పోలీసులు లాఠీలకు పనిచెప్పి, అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలావున్నాయి... పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం, పి.నారాయణపురం, రాచన్నగూడెం, ములగలంపల్లి, స్వర్ణవారిగూడెం పంచాయతీల్లో ప్రభుత్వం నాలుగు వేల ఎకరాల భూమి సేకరించింది. ఈ భూముల్లో కొంతమేర పునరావాస కాలనీలు నిర్మించడానికి ఉద్దేశించగా, మిగిలిన భూమిని నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమిగా పంపిణీచేయాలని నిర్దేశించారు. ఇందులో కొంత భూమిని వేలేరుపాడు మండలం కొయిదా గ్రామానికి చెందిన నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమిగా పట్టాలిచ్చారు. అలాగే ఇక్కడ మోడల్ కాలనీ నిర్మించాలని నిర్ణయించారు. అయితే, ఈ భూమిని నిర్వాసితులు కౌలుకు ఇవ్వడంతో కౌలు రైతులు పొగాకు, మొక్కజొన్న పంటలువేశారు. నిబంధనల ప్రకారం నిర్వాసితులకు పంపిణీచేసిన భూమిని కౌలుకు ఇవ్వకూడదు. అలాగే మోడల్ కాలనీ నిర్మించతలపెట్టిన భూమిలో కూడా పంటలు వేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం పంటలను ధ్వంసం చేయడానికి ట్రాక్టర్లతో అక్కడకు చేరుకున్నారు. అయితే ఒక నెల గడువు ఇస్తే పంటలు చేతికివస్తాయని, అప్పుడు ఖాళీచేసి భూములు అప్పగిస్తామని రైతులు కోరారు. అధికారులు సమ్మతించకపోవడంతో రైతులు వారితో వాగ్వివాదానికి దిగి, ఆందోళన చేపట్టారు. పంటలు ధ్వంసం చేయడానికి తీసుకొచ్చిన ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. దీనితో పోలీసులు లాఠీఛార్జిచేశారు.

పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి:గిడుగు

విజయవాడ, జనవరి 31: పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు బుధవారం డిమాండ్ చేశారు. పోలవరం ఆర్ ఆర్ ప్యాకేజీ వల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోయారంటూ, 18 ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం పనులపై సమీక్షించి, పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించే అంశంపై ఒక స్పష్టత ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పోరాటాల ఫలితమేనని రుద్రరాజు పేర్కొన్నారు. 7 నుంచి పోలవరం నిర్మాణం సత్వరం జరగాలని కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను, 10న సామూహిక సత్యాగ్రహం నిర్వహించిన విషయం గుర్తు చేశారు. కాంట్రాక్టర్ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారని అన్నారు.