ఆంధ్రప్రదేశ్‌

కమిషనర్ లక్ష్మీప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 1: కోట్ల రూపాయల అక్రమార్జనతో ఏసీబీకి దొరికిపోయిన కమర్షియల్ టాక్స్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ మరిన్ని ఆస్తులను ఏసీబీ అధికారులు గురువారం బయటపెట్టారు. లక్ష్మీ ప్రసాద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు నాలుగున్నర కిలోల బంగారాన్ని విశాఖలోని ఏసీబీ కార్యాలయంలో గురువారం సాయంత్రం మీడియా ముందు ఉంచారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ లక్ష్మీ ప్రసాద్ పెద్ద ఎత్తున బినామీ ఆస్తులు కూడబెట్టారని అన్నారు. అక్రమార్జనలో 50 శాతం ఆయన రెండో భార్య మల్లిక పేరిట ఉందని అన్నారు. బినామీ చట్టానికి పదును పెట్టామని, ఇలాంటి బినామీ ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని చెప్పారు. కేసు దర్యాప్తు జరిపిన తరువాత సదరు ఆస్తులు బినామీవి అని తేలితే, వాటిని ప్రభుత్వపరం చేసుకుంటుందని, లేకుంటే, తిరిగి ఇచ్చేస్తామని రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. లక్ష్మీ ప్రసాద్ గుంటూరు, ఆదిలాబాద్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారని అన్నారు. లక్ష్మీ ప్రసాద్‌ను అరెస్ట్ చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు డీఎస్మీ రామకృష్ణ ప్రసాద్ వెల్లడించారు.