ఆంధ్రప్రదేశ్‌

ఆచి తూచి అడుగేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి చేసిన కేటాయింపులపై తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం కొనసాగుతోంది. దానిపై ఏవిధంగా స్పందించాలి? ప్రజాస్పందన ఏవిధంగా ఉందన్న కీలక అంశాలపై ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం పార్టీ సమన్వయ కమిటీతో నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. బడ్జెట్‌పై స్పందించిన నేతలు.. కేంద్రం నుంచి మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి బయటకు వచ్చి ఉద్యమించాలని, హోదా సహా రాష్ట్ర హక్కులపై ఉద్యమించాలని సూచించారు. అయితే, నేతల దూకుడులో విపరీత ధోరణి కనిపించడంతో బాబు వారికి పగ్గాలేశారు. కేంద్రంతో విభేదించి బయటకొస్తే లాభమేమిటని, మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైనందున ఆచితూచి అడుగులేయాల్సి ఉందన్నారు. ఎవరూ అతిగా స్పందించవద్దని ఆదేశించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ముఖ్యులతో బాబు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌పై ప్రజాస్పందన ఎలా ఉందని బాబు జిల్లా పార్టీ అధ్యక్షుల వద్ద ఆరా తీశారు. దానితో రెండు జిల్లాలకు చెందిన నేతలు ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, కేంద్రం నుంచి బయటకు వచ్చి, అంతా రాజీనామాలు చేసి ఉద్యమించాలని సూచించారు. హోంమంత్రి చినరాజప్ప కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో మన నిరసన తెలుపుదామని ఆయన ప్రతిపాదించగా, జనం మన పక్షానే ఉన్నందున, ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారని మిగిలిన నేతలు స్పష్టం చేశారు.
దీనితో సమావేశంలో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని, చర్చ ఎక్కడికో వెళ్లిపోతోందని, ఇది వీడియో కాన్ఫరెన్సు కాబట్టి రాష్టమ్రంతా చూస్తారని, నేతల మాటలతో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని సూచించారు. దానితో బాబు వారిని మందలిస్తూ మాట్లాడారు. ‘ప్రజలేమనుకుంటున్నారో చెప్పమంటే మీ సొంత అభిప్రాయాలు చెబుతున్నారు. ఎప్పుడూ మీతో ఇదే ప్రమాదం. మీ అభిప్రాయాలను రుద్దుతుంటారు. కేంద్రం నుంచి బయటకు వస్తే ఏమవుతుంది? మనపై నమ్మకంతో ప్రజలు బాధ్యత పెట్టారు. దానిని నెరవేర్చాలి. అక్కడ మనకున్న ఇద్దరూ నామమాత్రమే. మనం పదవుల కోసం పొత్తు కొనసాగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం అంత సులువైంది కాదు. బయటకు వస్తే రాష్ట్రానికి సంబంధించిన పనులు కేంద్రంలో ఎలా అవుతాయి? అయినా ఏం చేయాలో మేం ఆలోచించి నిర్ణయిస్తా’మని వీడియో కాన్ఫరెన్సు చర్చను ముగించారు. హోదా బదులు దానికంటే మించిన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని, చివరకు అది కూడా ఇవ్వడం లేదని, రైల్వే జోన్ కూడా పక్కనబెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలు నిన్నటి నుంచీ ఇలాగైతే ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న బాధతో ఉన్నారన్నారు.
ఈ సందర్భంగా బడ్జెట్ కేటాయింపులపై బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మనం వౌనంగా ఉంటే ప్రమాదమని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై స్పందించాల్సిన వేదికలపై స్పందించాలన్నారు. అలాగని మీరెవరూ అతిగా స్పందించవద్దని, ఇవ్వాల్సినవే చెప్పాలని స్పష్టం చేశారు. మన అసంతృప్తి మాత్రమే తెలియచేయాలన్నారు. ‘వాళ్లు మనకేమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు. పోనీ అన్ని రాష్ట్రాలతోపాటు ఇచ్చినా బాగుండేది. కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారే తప్ప, కష్టాల్లో ఉన్న మనల్ని పట్టించుకోకపోవడం బాధగా ఉంది. ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు. మనం బయటకొస్తే కావలసినవి ఎవరు అడుగుతారు? బడ్జెట్‌పై మనల్ని విమర్శిస్తోన్న వైసీపీ ఏం చేస్తోంది? రాజీనామాలు చేస్తానని కేసుల భయంతో తోకముడిచింది. ఈ రోజు మీడియా అంతా రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి రాస్తే, జగన్ మీడియా మాత్రం మన పార్టీ వల్లే అన్యాయం జరిగిందని రాసి, ప్రజల మనోభావాలను తెరమరుగు చేసింద’ని విరుచుకుపడ్డారు. రాజకీయంగా మనం జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా రాజస్థాన్‌లో జరిగిన మూడు ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, ఎవరూ అతి ఆత్మవిశ్వాసంతో వెళ్లవద్దని హెచ్చరించారు. ‘రెండు రాష్ట్రాల్లో టీడీపీని దెబ్బతీసేందుకే విభజన చేశారు. జగన్, కేసీఆర్‌తో నాటి కాంగ్రెస్ రహస్య ఒప్పందాలు చేసుకుంది. కేసీఆర్ విభజించాలని చెబితే నేను సమన్యాయం చేయమన్నా. కానీ అప్పుడెవరూ నా మాట వినలేదు. జగనయితే స్పష్టమైన వైఖరి చెప్పకుండా విభజించే అధికారం మీకుందని చెప్పారు. పెద్దమ్మనే కాదు చిన్నమ్మనూ గుర్తుంచుకోవాలన్నారు. అప్పటి ఎంపీలు నామా, మోదుగులపై దాడి చేశారు. రాజ్యసభలో మాత్రం ఒక్క వెంకయ్యనాయుడు పట్టుపట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మన గొంతు నొక్కింద’ని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, మనకు జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర అవసరాలే ఇప్పటికీ ముఖ్యమని బాబు స్పష్టం చేసినట్లు సమాచారం.