రాష్ట్రీయం

ఏపీలో లాక్‌హీడ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: రక్షణ రంగ ఉత్పత్తులు, విమానయాన రంగానికి సంబంధించి ఉత్పత్తులు చేస్తున్న లాక్‌హీడ్ కంపెనీ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దావోస్ పర్యటన సందర్భంగా మూడో రోజు పలువురు ప్రముఖులు, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. సాఫ్ట్‌వేర్, రక్షణ రంగం, ఉపగ్రహాల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న లాక్‌హీడ్ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫైటర్ జెట్ల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన లాక్‌హీడ్‌మార్టిన్ కంపెనీ సాఫ్ట్‌వేర్ రంగంలోనూ మిలిటరీ పౌర ఉపగ్రహాల తయారీలోనూ అపార అనుభవం ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లాక్‌హీడ్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరపడం మూడోరోజు పర్యటనలో ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ రంగ పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనువైన ప్రాంతాల గురించి లాక్‌హీడ్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
లాక్‌హీడ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) మార్లిన్ హ్యూసన్ ఇందుకు సానుకూలంగా స్పందించి భారత్‌లో ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టెక్సాస్‌లోని తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను కొన్నింటిని భారత్‌కు తరలించే యోచన ఉందని వివరించారు.