రాష్ట్రీయం

కిడ్నాప్ వెనుక ఏపీ ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కిడ్నాపర్ల చేతిలో కిరాతకంగా హత్యకు గురైన విద్యార్థి అభయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సాయి అరెస్టయ్యాడు. రాజమండ్రి టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడు సాయిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు సికిందరాబాద్‌లోని అల్ఫా హోటల్ ఎదురుగా ఓ అట్టపెట్టెలో కనుగొన్న సంగతి తెలిసిందే. స్థానికంగా కలకలం రేపిన విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బేగంబజార్‌కు చెందిన వ్యాపారి రాజ్‌కుమార్ కొడుకు అభయ్‌ను గతంలో రాజ్‌కుమార్ వద్దే పనిచేసిన సాయి అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు సాయి రాజమండ్రికి చెందిన ఓ ముఠా సహాయంతో రాజ్‌కుమార్‌ను పది కోట్లు డిమాండ్ చేశాడని, అంత డబ్బు తమ వద్ద లేదని రాజ్‌కుమార్ భార్యతో చర్చలు జరుగుతుండగానే రాజమండ్రి గ్యాంగ్ అభయ్‌ను చంపేసినట్టు తెలుస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థి తల్లిదండ్రులు సికిందరాబాద్ చేరుకునే లోగా అభయ్ మృతదేహాన్ని అల్ఫా హోటల్ ఎదురుగా వదిలేసిన సాయి సికిందరాబాద్ నుంచి రాజమండ్రికి పారిపోయాడు. విద్యార్థి అభయ్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు పది టీమ్‌లు రంగంలో దింపినట్టు పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. అయితే ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు సాయి కాగా రాజమండ్రికి చెందిన మరో ముగ్గురిని విజయవాడ పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు డిసిపి వెంకటేశ్వరరావు వివరించారు.