ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌డీఏ కూటమికి ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 3: కేంద్రంలో ఎన్‌డిఏ కూటమి బలంగా ఉందని, దీనికి ఎటువంటి డోకాలేదని రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి పైడికొండ మాణిక్యాలరావు అన్నారు. విశాఖ నగర శివారు ప్రాంతంలో ఉన్న వైజాగ్ కనె్వక్షన్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ఫోటోట్రేడ్ షోను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రైల్వేజోన్‌కు సంబంధించి సాంకేతిక ఇబ్బందులున్నాయని చెప్పారు. అయితే, ప్రత్యామ్నాయ పద్ధతిలో జోన్ ఇచ్చే అవకాశాలున్నాయన్నారు. రైల్వేజోన్ ఆకాంక్ష ఉందని ఆయన స్పష్టంచేశారు. ప్రతిఒక్క పథకం ప్రజలకు అందేలా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏపీకి అన్యాయం జరగకుండా ఆలోచన చేస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశేషంగా కృషి చేస్తున్నారని మాణిక్యాలరావు అన్నారు. డ్రోన్లపై నిషేధం ఉందని, అయితే, ఇవి ఇప్పటికే కలిగి ఉండే వారికి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తాను దీనిపై క్యాబినేట్‌లో చర్చించగా, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఆంధ్రా, తెలంగాణాకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్ళను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా గతకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు రకాల సమస్యలను ఫొటోగ్రాఫర్ల సంఘ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు.