ఆంధ్రప్రదేశ్‌

ఏపీ రెరా వెబ్‌సైట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి నియంత్రణా ప్రాధికార సంస్థ (ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ) వెబ్‌సైట్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కరికల్ వలవన్ సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఇక రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు తమ ప్రాజెక్టులను ఏపీ రెరా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, ఆర్టీసీ హౌస్ మొదటి అంతస్తులోని ఏపీ రెరా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వెబ్‌సైట్ ప్రారంభోత్సవంలో ఏపీ టిడ్కో ఎగ్చిక్యూటివ్ వైస్ చైర్మన్ వి.రామనాధ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఓఎస్డీ సురేష్, ఏపీ రెరా డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ సిహెచ్‌వి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రెరా సంస్థ వల్ల స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లలో సంపూర్ణ పారదర్శకత సాధ్యమవుతుందని కరికల్ వలవన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రెరా చట్టం కింద అమ్మకానికి, లేదా లీజు ఉద్దేశించిన ప్రతి భవన సముదాయం, భూ సముదాయం (ప్లాట్లు-లేఅవుట్లు) అన్నీ తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ పొందాలని ఆయన వివరించారు. కనుక రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, నిర్మించనున్న అపార్టుమెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, ముందుగా ఏపీ రెరా వద్ద రిజిస్టరై నంబరు పొందిన తర్వాత మత్రమే ప్రకటనలు, బ్రోచర్లు తదితర మార్కెటింగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని ఆయన సూచించారు. రెరా చట్టం ప్రకారం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల ప్రకటనల్లోనూ తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ప్రకటించాలని, ఏపీ రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్థిరాస్థి ప్రాజెక్టుల అమ్మకాలు చేపట్టడం నేరమని ఆయన వివరించారు. రాష్ట్రంలో స్థిరాస్థి కొనుగోలుదారులంతా రెరా చట్టం నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని, స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందే అవి ఏపీ రెరా వద్ద రిజిస్టరు అయ్యాయో లేదో తనిఖీ చేసుకోవాలని, స్థిరాస్తి వివాదాల సత్వర పరిష్కారానికి ఏపి రెరాను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.