ఆంధ్రప్రదేశ్‌

బెర్లిన్‌లో పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి అమరనాథ్‌రెడ్డి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమర్‌నాధ్‌రెడ్డి అన్నారు. సోమవారం జర్మనీ రాజధాని బెర్లిన్‌లో మంత్రి అమర్‌నాధ్‌రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. మొదట బెర్లిన్‌లో మంత్రి మెట్రో ఏపీ జనరల్ (మేనేజర్ ఇంటర్నేషనల్ ఏఫైర్స్)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. వైజాగ్, తిరుపతి నగరాల్లో మెట్రోలను స్థాపించాలని మంత్రి కోరారు. అనంతరం క్లుస్ జాన్ హెడ్ ఆఫ్ ఏపీ అమరావతి, ఇతర ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రంలో ఉన్న వౌళిక వసతులు, వనరులను పరిశీలించాలని మంత్రి అమరనాధ్‌రెడ్డి సూచించారు. పెద్దఎత్తున మీడియం సైజ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఈ అసోసియేషన్ సభ్యులు తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. త్వరలోనే ఏపీలో పర్యటిస్తామని మంత్రికి వారు తెలిపారు. జర్మనీ కాలమాన పట్టిక ప్రకారం రాత్రి (్భరత్‌లో అర్ధరాత్రి) జర్మనీలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.