ఆంధ్రప్రదేశ్‌

దళితుల అభ్యున్నతికి సర్కార్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.9,847 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.5,348 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రముఖ విద్యావేత్త, పరిశోధకుడు నేలపూడి స్టాలిన్‌బాబు రచించిన ‘ఎస్‌సి, ఎస్టీ కాంపొనెంట్ అవగాహన ఆవశ్యకత’ పుస్తకాన్ని వెలగపూడి సచివాలయంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాలపై అవగాహనకు ఇటువంటి పుస్తకాలు మరిన్ని వెలువడాల్సి ఉందని అన్నారు. చట్టం ద్వారా ప్రనత్వుం చేపడుతున్న పథకాలపై ఈ పుస్తకం సవివర రచన అని అన్నారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించి చైతన్యం నింపేందుకు కృషి చేస్తున్న స్టాలిన్ బాబును ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ప్రభుత్వపరంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబును ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే చంద్రన్న ముందడుగు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని, ఇందుకోసం ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ప్రశంసాపూర్వకంగా అన్నారు.