ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర పురపాలక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 14 నగర పాలక సంస్థలు, 4 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. క్యాంటీన్ల ఏర్పాటుపై అధికారుల బృందం కర్నాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీల్లో పర్యటించి అధ్యయనం చేసింది. క్యాంటీన్లు, కిచెన్ల ఏర్పాటు, ఇందుకు అవసరమైన సామగ్రి సేకరణ, కేటరింగ్ సర్వీసుల గుర్తింపు వంటి మూడు అంశాలు క్యాంటీన్ల ఏర్పాటులో ముఖ్యమైనవిగా గుర్తించారు. ఉదయం అల్పాహారాన్ని 5 రూపాయలకు, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను 10 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ మూడింటికీ కలిసి 57 రూపాయలు ఖర్చు అవుతుండగా, సబ్బిడీపై 25 రూపాయలకు సరఫరా చేస్తున్నారు.