ఆంధ్రప్రదేశ్‌

న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను సందర్శించిన లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: ‘ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి’ అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్కు స్టాక్ ఎక్సేంజ్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ఎక్సేంజ్ గ్రూపు ప్రెసిడెంట్ టామ్ ఫార్లే, టెక్నాలజీ హెడ్ అట్లూరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో పెద్దఎత్తున టెక్నాలజీ వినియోగిస్తున్నామని, రియల్ టైమ్ గవర్నెన్సును అమలు చేస్తున్నామన తెలిపారు. పాత తరం టెక్నాలజీలకు కాలం చెల్లిందని, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటివి వాటిపై దృష్టి పెట్టామన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అకాడమీ ప్రారంభించబోతున్నామన్నారు. ఏపీని శ్యాండ్ బాక్స్‌గా భావించి, అభివృద్ధి చేస్తున్న అధునాతన టెక్నాలజీలను తమ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టులుగా చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సెర్నర్ ఇన్నోవేషన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలన్నది సీఎం లక్ష్యమని వివరించారు.