ఆంధ్రప్రదేశ్‌

అటవీ పరిరక్షణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: అటవీ, పర్యావరణ పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. సోమవారం వెలగపూడిలోని తన కార్యాలయంలో తనను కలిసిన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ అటవీ నర్సరీలను వనమిత్ర పేరుతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 20 నర్సరీలను గుర్తించామని, వీటిని సుమారు రూ.3కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను ఆదేశించామన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని స్టోన్ క్రషింగ్ కంట్రోల్ బోర్డ్ అధికారులను కూడా ఆదేశించామన్నారు. రాష్ట్రంలోని స్టోన్ క్రషింగ్ యూనిట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.