ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆఫీసు ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని నిరసిస్తూ బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం రాజమహేంద్రవరంలో సోమవారం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కార్యాలయ ముట్టడి యత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
నిరసనకారులను బీజీపీ శ్రేణులు అడ్డుకుని, రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాలిలావున్నాయి... కేంద్ర బడ్జెట్ తీరును నిరసిస్తూ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మరుకుర్తి దుర్గా యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సోము ఇంటి వద్ద మోహరించాయి. ముట్టడికి నల్ల జెండాలతో వస్తున్న బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం నాయకులను పోలీసులు నిలువరించారు. అప్పటికే సోము కార్యాలయంవద్ద సిద్ధంగా వున్న సుమారు రెండు వందల మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు ఆగిన ప్రదేశంవద్దకు చేరుకుని సోము జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈక్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలు నిరసనకారులపై రాళ్ళు రువ్వారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులను చెదరగొట్టి సోము కార్యాలయానికి పరిమితం చేశారు. బీసీ విద్యార్ధి సంక్షేమ కార్యకర్తలను లాలాచెరువుజంక్షన్ వరకు పంపించివేశారు. అక్కడ మరుకుర్తి దుర్గా యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ తీరు, సోము వీర్రాజుపై నిరసన వ్యక్తం చేస్తూ నల్ల జెండాలను రోడ్డుపై వేసి తగులబెట్టారు.

చిత్రం.. ఇరువర్గాలను చెదరగొడుతున్న పోలీసులు