ఆంధ్రప్రదేశ్‌

కృష్ణమ్మ ఒడినుంచి బయటపడుతున్న సంగమేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 5: శ్రీశైలం జలాశయంలోని కృష్ణాజలాల నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. సోమవారం ఆలయ శిఖరం బయటపడి భక్తులను ఆనందంలో ముంచెత్తింది. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన పూర్తిస్థాయిలో గంగ ఒడికి చేరిన సంగమేశ్వరుడు క్రమేణా మళ్లీ భక్తుల దర్శనం కోసం సిద్ధమవుతున్నాడు. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని పురాతన సంగమేశ్వర ఆలయం వేసవికాలం మినహా సుమారు ఎనిమిది నెలలు కృష్ణాజలాల్లో మునిగిపోయే విషయం విదితమే. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తక్కువగా ఉండటంతో ఆలస్యంగా బయటపడుతోంది. గత ఏడాది మహాశివరాత్రికి పూజలందుకున్న సంగమేశ్వరుడు ఈ ఏడాది మాత్రం కేవలం శిఖర దర్శనానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఆలయ శిఖరానికి పూజలు నిర్వహించడానికి ఆలయ పూజారి తెలకపల్లి రఘురామశర్మ సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 857.30 అడుగులుగా నమోదైంది. దీంతో ఈ ఏడాది ఆలయం పూర్తిగా బయటపడి భక్తుల పూజలు అందుకోవాలంటే ఏప్రిల్ మాసాంతం వరకు ఆగాల్సి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

చిత్రం..కృష్ణమ్మ ఒడినుంచి బయటపడుతున్న సంగమేశ్వరుడు