ఆంధ్రప్రదేశ్‌

‘రూట్’ మార్చనున్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చే దారిని మారుస్తున్నారు. దీంతో సీడ్ యాక్సెస్ రోడ్డు పోలీసు బలగాల నిఘా నీడలోకి వెళ్లిపోయింది. సీఎం చంద్రబాబు ఇప్పటి వరకూ ఉండవల్లి లోని తన నివాసం నుంచి కరకట్ట, వెంకటపాలెం మీదుగా సచివాలయానికి వస్తున్నారు. వెంకటపాలెం మీదుగా సీఎం రాకపోకలు సాగిస్తుండటంతో నివాస ప్రాంతాల మధ్య నుంచి, ఎక్కువ వంపులు ఉన్న రోడ్ల మీదుగా సీఎం కాన్వాయ్ వెళ్తుండేది. సీఎం భద్రత దృష్ట్యా సచివాలయానికి సీఎం వచ్చేటప్పుడు, వెళ్లే సమయంలో దాదాపు గంట సేపు వాహనాల రాకపోకలు నిలిపివేస్తుంటారు. దీని వల్ల ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీడ్ యాక్సెస్ రోడ్డు కొంత మేర సిద్ధం అవడంతో ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు రంగం సిద్ధం చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా తాళ్లాయపాలెం, మందడం మీదుగా సచివాలయానికి చేరుకుంటారు. సీఎం కాన్వాయ్ వెళ్లే కొత్త రూట్‌లో గురువారం నుంచి ప్రతి 30 మీటర్లకు ఒక కానిస్టేబుల్‌ను నియమించారు. బాంబ్ స్క్వాడ్‌లు ఇప్పటికే జల్లెడ పట్టాయి. ఈ రోడ్డు పరిధిలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ పరిధిలో ఉండటంతో ఆదివారం కొత్త రూట్‌ను అధికారులతో పరిశీలించారు. త్వరలో ఈ దారిని సీఎం రాకపోకలకు వినియోగించనున్నారు.