ఆంధ్రప్రదేశ్‌

మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రాకు సముచితన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, ఫిబ్రవరి 10: వచ్చే నెల 5 నుంచి తిరిగి ప్రారంభయ్యే పార్లమెంటు బడ్జెట్ మలివిడత సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి సముచిత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్టులో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారని, వచ్చే 5న జరిగే పార్లమెంటరీ సమావేశాల్లో రాష్ట్రంలోని విశాఖ రైల్వేజోన్ విషయంలో గానీ, కడప ఉక్కు కర్మాగారం గానీ, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గానీ స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయవచ్చునన్నారు. ప్రతిపక్ష, వామపక్షాలు ప్రత్యేక హోదా అడుగుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజీ కోసమే పోరాడుతున్నారన్నారు.