ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాలకతీతంగా అందరం ఒక్కటవుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 10: రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరం ఒక్కటై కేంద్రం మెడలు వంచుదామని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని పీసీసీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర హక్కుల సాధనకు రాజకీయాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడుదామని, ఈ పోరాటంలో భాగస్వాములై ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని రక్షించుకుందామని తెలిపారు. మార్చి 6, 7, 8వ తేదీలలో ఢిల్లీలోనే ఉండి తాడోపేడో తేల్చుకునేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. 6,7 తేదీలలో దీక్షలు చేపట్టి 8న పార్లమెంటును ముట్టడించే కార్యక్రమం చేపట్టి కేంద్రంపై వత్తిడి తీసుకొద్దామన్నారు. ఇప్పుడు సాధించుకోలేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో భాగంగా ఈనెల 15వ తేదీ వరకూ అన్ని మండల కేంద్రాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిరసన కార్యక్రమాలను చేపడతున్నామని, 20 నుంచి 28వ తేదీ వరకూ రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష పేరిట ఒకరోజు దీక్ష చేద్దామన్నారు. చివరిగా మార్చి 2వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు సత్తా చాటే విధంగా అన్ని జాతీయ రహదారులను స్తంభింపచేయాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, పీసీసీ నేతలు మీసాల రాజేశ్వరరావు, వి గురునాథం, కొలనుకొండ శివాజీ, తదితరులు పాల్గొన్నారు.