ఆంధ్రప్రదేశ్‌

విభజన చట్టంలో హామీల అమలుకు పోరు: విజయసాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 12: ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైకాపా తొలి నుంచి పోరాడుతోందని, ఈక్రమంలో మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం అందాల్సిన అన్ని అంశాలపై వైకాపా రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు, ఆపార్టీ ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రకటించిన అనంతరం టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ముందు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారని, అయితే అందులో ప్రత్యేక హోదా కావాలన్న డిమాండే లేదన్నారు. అంటే టీడీపీ ఇప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదలి ప్రత్యేక ప్యాకేజీల కోసం పాకులాడుతోందన్నారు. ప్యాకేజీల పేరుతో కేంద్రం నిధులు ఇస్తే వాటిని దండుకోవడం కోసమేనని వారి ఆందోళన అని ఆరోపించారు. ప్యాకేజీలన్నింటిని విదేశాలకు తరలించేందుకు టీడీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై ఎవరు పోరాటం చేసినా వారితో కలిసి వెళతామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.