ఆంధ్రప్రదేశ్‌

ఏపీ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), పిబ్రవరి 17: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఏపీ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఏపీ టీఆర్‌ఎస్ నాయకులు కొణిజేటి ఆదినారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసి మెలిసి జీవించి, అభివృద్ధి పథంలో నడవాలన్న కేసీఆర్ ఉద్దేశ్యాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన జన్మదినం పురస్కరించుకుని కనకదుర్గమ్మ ఆశీస్సులు అందాలని కోరుకుంటూ ఈప్రత్యేక పూజలను నిర్వహించినట్టు ఆయన తెలిపారు. అలాగే నవ్యాంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమని గుర్తించిన ఏపీ టీఆర్‌ఎస్, ఆ ఉద్యమంలో భాగస్వామ్యమవుతుందన్నారు. శనివారం లెనిన్ సెంటర్ ధర్నా చౌక్‌లో 123 స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన హోదా సాధన రిలే దీక్షలో ఏపీ టీఆర్‌ఎస్ నాయకులు మద్దతు పలికారు.
.