ఆంధ్రప్రదేశ్‌

6న అసెంబ్లీ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 17: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు పోరాటం ఉద్ధృతం చేయాలని రాయలసీమ హైకోర్టు సాధన సమితి జేఏసీ తీర్మానించింది. శనివారం కర్నూలులో జరిగిన జేఏసీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు కోర్టు విధులను మార్చి 9 వరకు బహిష్కరించాలని నిర్ణయించారు. అదే విధంగా ర్యాలీలు, రిలే నిరహారదీక్షలు కొనసాగించాలని తీర్మానించారు. ఈనెల 22న అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్న సీఎంను అడ్డుకోవాలని, 26న కలెక్టరేట్, ఆర్డీఓ, మండల తహశీల్దార్ల కార్యాలయాల ముట్టడించాలని నిర్ణయించారు. రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ముట్టడి, రహదారుల దిగ్బంధం, మార్చి 6న చలో అమరావతి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించారు. జేఏసీ కన్వీనర్ మస్తాన్‌వలి, కో-కన్వీనర్ వి.నాగలక్ష్మిదేవి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
ఎ.రామిరెడ్డి, యన్.బాలనాగిరెడ్డి, చిత్తూరు బార్ అధ్యక్షులు రవీంద్రారెడ్డి, అనంతపురం బార్ అధ్యక్షులు భరత్ భూషణ్‌రెడ్డి, ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.