ఆంధ్రప్రదేశ్‌

జగన్ దొంగ.. పవన్ మాకు మిత్రుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 17: బహిరంగంగా అవినీతికి పాల్పడి నేరం చేస్తూ దోషిగా దొరికి కూడా నిస్సిగ్గుగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగటం వైఎస్ జగన్ అనైతిక రాజకీయాలకు పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ గనులు, భూములు కారుచౌకగా కట్టబెట్టి తత్ఫలితంగా (క్విడ్ ప్రోకో) కోట్లాది రూపాయలు తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకోవడం బహిరంగ అవినీతి కాదా అని ప్రశ్నించారు. 7 కేసుల్లో ఈడీ చార్జిషీట్లు వేయించుకున్న జగన్ ఏ విధంగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎలా కొనసాగుతాడని ప్రశ్నించారు. నిన్న పెన్నా సిమెంట్స్, మొన్న ఇందుటెక్ కంపెనీల్లో జగన్ క్విడ్ ప్రోకో చార్జిషీట్లు ఈడీ కోర్టు పరిగణలోకి తీసుకున్న తరువాత, జగన్ అవినీతి స్పష్టంగా నిరూపణ అయినట్లు కాదా అన్నారు. ఈడీ చార్జిషీట్లలో ప్రాథమిక విచారణ)లో స్పష్టంగా రుజువులుంటే తప్ప పరిగణించరన్నారు. ఇప్పుడు 7 చార్జిషీట్లు ఈడీ కోర్టు పరిగణనలోకి తీసుకుంటే ఏ రకంగా, నిస్సిగ్గుగా ప్రజల్లో తలెత్తుకుని తిరుగుతున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ తమ పార్టీకి, ప్రభుత్వానికి మంచి నమ్మకమైన మిత్రుడని, చంద్రబాబు పరిపాలనా దక్షత మెచ్చుకునే వ్యక్తని, తెలుగుదేశం పార్టీ పదికాలాలు అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తని చెబుతూ నిజనిర్ధారణ కమిటీలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల నియామకం పట్ల పునఃపరిశీలించాలని కోరారు. ‘తోట చంద్రశేఖర్ గతంలో ఐఏఎస్.. ఇప్పుడు వైసీపీ, ఐవైఆర్ కృష్ణారావు గతంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నత పదవులు అలంకరించిన వ్యక్తి.. కానీ పదవీ విరమణ అనంతరం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తి, జగన్ పట్ల అనురాగాన్ని వ్యక్తం చేసే వ్యక్తి, మూడవ ఐఏఎస్ పద్మనాభయ్య ఢిల్లీకే పరిమితమై మన రాష్ట్ర రాజకీయాలు అట్టే తెలియని మనిషి అన్నారు. ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశమిస్తారోనని’ అనుమానం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ జగన్ తన అడ్వకేట్స్ సలహా మేరకు పాదయాత్ర కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకున్నాడని విమర్శించారు. ఆర్థిక నేరస్థుడనేటటువంటి వ్యక్తి కచ్చితంగా ఉండాల్సిన చోటు జైలు మాత్రమేనన్నారు.