ఆంధ్రప్రదేశ్‌

హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: దేశంలోనే ప్రథమంగా హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు తయారీపై ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- చెన్నై, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం- ఏపీ-అమరావతి, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)- చెన్నై మధ్య శనివారం చెన్నైలో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం - ఏపీ-అమరావతి ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి నారాయణరావు, ఐసీఎఫ్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బి చంద్రశేఖర్ సంతకాలు చేశారు. ఒప్పందానికి అనుగుణంగా డాక్టర్ నారాయణరావు పర్యవేక్షణలో ఐసీఎఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ విద్యాసంస్థల అధ్యాపకులు, విద్యార్థులు హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు తయారీ ప్రాజెక్టులో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టు గురించి డాక్టర్ నారాయణరావు వివరిస్తూ హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలుకు ఒక ఇంజన్‌తో పాటు రెండు బోగీలు ఉంటాయని తెలిపారు. ఒక్కో బోగీలో 65 మంది ప్రయాణించడానికి సదుపాయం ఉంటుందన్నారు. ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, అనంతరం ఐసీఎఫ్‌లో దాన్ని ప్రయోగాత్మకంగా నడుపుతామని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ప్రయాణికుల కోసం ఈ రైలు నడపనున్నట్లు వెల్లడించారు. ప్రతి రైలు ఇంజన్ అడుగు భాగాన కంప్రెస్ చేసిన హైడ్రోజన్‌తో కూడిన ఆరు ట్యాంకులు ఏర్పాటు చేస్తారని, ఒక్కో ట్యాంక్‌లో 60 కిలోల హైడ్రోజన్ ఉంటుందన్నారు. ప్రస్తుతం డీజిల్ లేదా విద్యుత్‌తో నడిచే రైళ్ల నిర్వహణ వ్యయం కన్నా హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు నిర్వహణ ఖర్చు చాలా తక్కువన్నారు. ఈ రైలు నుండి ఎలాంటి కాలుష్యకారక కార్బన్‌డయాక్సైడ్ విడుదల కాదని డాక్టర్ నారాయణరావు వివరించారు.