ఆంధ్రప్రదేశ్‌

సరళంగా పెట్టుబడుల ఆకర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు - 2018లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కమిషనరేట్ ఇనె్వస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. శనివారం నుంచి మొదలవుతున్న సదస్సులో ఈ డెస్క్ పెట్టుబడిదారులకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడం ఎంత లాభదాయకమో చెప్పడంతో పాటు ఎంత సరళంగా పెట్టుబడి పెట్టే విధానం ఉందో కూడా వివరిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో ఏర్పాటు చేసిన ఈ డెస్క్ నేరుగా పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. నాలెడ్జ్ పార్టనర్ కేపీఎంజీ సంస్థ సభ్యులతో పాటు పరిశ్రమల శాఖలో జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు తమ సిబ్బందితో కలిసి ఇక్కడ పనిచేస్తారు. పెట్టుబడిదారులను డెస్క్ దగ్గరకు తీసుకురావడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఎంత లాభదాయకమో, సరళమో వారికి వివరిస్తారు. దరఖాస్తు చేసుకునే విధివిధానాలు, ప్రోత్సాహకాలు వివరిస్తారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామికవేత్తలకు ఈ డెస్క్ వెసులుబాటుగా ఉపయోగపడేలా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సూక్ష్మ పరిశ్రమల నుంచి మెగా పారిశ్రామికవేత్తల వరకూ అందరికీ ఇక్కడ సమాచారం అందించటం, వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడం పరిశ్రమల శాఖ లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటులో కష్టనష్టాలు ఇక గతమని, ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే విధానం చాలా సరళంగా మారిందని తెలియజెపుతారు. ముఖ్యంగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లూ సిద్ధంగా ఉంటే పారిశ్రామికవేత్తలు ఏ ఆఫీసుకూ వెళ్లాల్సిన అవసరం లేకుండానే అనుమతులు వచ్చే విధానాన్ని ఇక్కడి అధికారులు వివరిస్తారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవాల్సిన సింగిల్ డెస్క్ పోర్టల్ గురించి పెట్టుబడిదారులకు వివరించి వారికి పెట్టుబడులు పెట్టడానికి అనుమతులు రావడం ఎంత సులభమో తెలుపుతారు. ఈ సింగిల్ డెస్క్ బ్యూరో (ఎస్డీబీ) మొత్తం 20 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ పరిశ్రమల స్థాపనకు అనుమతిని నిర్ణీత వ్యవధిలో ఇవ్వడానికి దోహదపడనుంది.