రాష్ట్రీయం

కర్నాటక, సీమకు అన్నపూర్ణ తుంగభద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని/బళ్ళారి, ఫిబ్రవరి 27: కర్నాటక, ఆంధ్ర రైతుల జీవనాడి, రాయలసీకు అన్నపూర్ణగా విరాజిల్లుతోంది తుంగభద్ర జలాశయం. కర్నాటక రాష్ట్రం హొస్పేట వద్ద తంగభద్ర నదిపై ఈ భారీ ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి సరిగ్గా 73 ఏళ్లు. 1945 ఫిబ్రవరి 28వ తేదీ అటు మద్రాసు ప్రెసిడెన్సీ, ఇటు నైజాం స్టేట్‌లో ఒకే సారి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఒకే ప్రాజెక్టును ఇద్దరు ఇంజినీర్లు చెరోవైపు నుంచి వేర్వేరుగా నిర్మించుకుంటూ పూర్తిచేశారు. ఇలాంటి అరుదైన అద్భుత కట్టడం దేశంలో మరోటి లేదనే చెప్పాలి. కర్నాటకలోని బళ్ళారి, రాయచూరు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూ లు, అనంతపురం జిల్లాలకు తాగు, సాగునీరు అందిస్తున్న తుంగభద్ర సీమకు అన్నపూర్ణగా పేరుగాంచింది. శృంగేరి వద్ద పుట్టిన తుంగ, భద్ర నదులు కొంతదూరం ప్రవహించి కూడలి వద్ద కలిసి తుంగభద్రగా ప్రవహిస్తున్నాయి. అక్కడి నుండి 640 కిలోమీటర్లు ప్రవహించి హొస్పేట లోని తుంగభద్ర జలాశయంలో కలుస్తుంది. వర్షాకాలంలో కర్నాటకలో పశ్చిమ కనుమలలో 4320 మిమీ వర్షం కురుస్తుండగా బళ్ళారి, రాయచూరు, కొప్పళ, అనంతపురం, కర్నూలు, కడప ప్రాంతాల్లో కేవలం 550 మిమీ వర్షం నమోదవుతోంది. ఈ పరిస్థితిని గమనించిన కాటన్ దొర తుంగభద్రపై హొస్పేట వద్ద డ్యాం నిర్మించాలని తలంచారు. 1860లో కాటన్ తుంగభద్ర జలాశయం నిర్మాణానికి నివేదిక సిద్ధం చేసి బ్రిటీష్ ప్రభుత్వానికి పంపారు. అయితే 85 ఏళ్ల తరువాత 1945 ఫిబ్రవరిలో తుంగభద్ర డ్యాం నిర్మాణానికి పునాది రాయి పడింది. మద్రాసు గవర్నమెంట్, నిజాం ప్రభుత్వాలు సంయుక్తంగా 1945లో తుంగభద్ర జలాశయం నిర్మాణానికి పూనుకున్నాయి. 1945 ఫిబ్రవరి 28న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ డ్యామ్ కుడి వైపు నిర్మాణానికి శంఖుస్థాపన చేయగా, హైదారాబాద్ ప్రిన్స్ బెరర్ ఎడమ వైపు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. కుడి భాగం నిర్మాణం పనులను ప్రముఖ ఇంజినీర్ తిరుమల అయ్యంగార్ పర్యవేక్షించగా, ఎడమవైపు నిర్మాణాలను ప్రముఖ ఇంజినీర్ ఖాజా అజిముద్దీన్ పర్యవేక్షించారు.
డ్యాం నిర్మాణం ముఖ్య ఇంజినీర్ల బోర్డు చైర్మన్‌గా మోక్షగుండం విశే్వశ్వరయ్యను 1947లో నియమించారు. ఆనాడు తుంగభద్ర డ్యాం నిర్మాణానికి కేవలం రూ.17.98 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వివిధ కాలువల నిర్మాణాలతో కలిసి రూ.130.76 కోట్లు ఖర్చయ్యాయి. కుడి దిగువ కాలువ పనులకు రూ.16.27 కోట్లు ఖర్చుకాగా, ఎగువ కాలువ పనులకు రూ.33.22 కోట్లు, ఎడమ కాలువ పనులకు రూ.50 కోట్లు, మిగిలిన కాలువలకు రూ.13.29 కోట్లు ఖర్చు చేశారు. 2,440 మీటర్లు పొడవున్న తుంగభద్ర డ్యాం నిర్మాణానికి 12 వేల మంది కార్మికులు శ్రమించారు. కాలువల నిర్మాణం పనుల్లో 38 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. 1953 సంవత్సరంలో 1,633 అడుగులు (133 టీఎంసీల) సామర్థంలో డ్యాం నిర్మాణం పూర్తిచేసి జాతికి అంకితం చేశారు. జలాశయానికి మొత్తం 230 టీఎంసీల నీరు చేరుతుందని అంచన వేసి ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేశారు. కర్నాటక వాటా కింద 151,49 టీఎంసీలు, ఆంధ్ర వాటా కింద 78,51 టీఎంసీలు కేటాయించారు. 18 టీఎంసీలు వృధా అవుతున్న నీటి కింద లెక్క కట్టారు. ఇందుకోసం తుంగభద్ర బోర్డును ఏర్పాటు చేసి నీటి పంపకాలు చేయడానికి పూర్తి అధికారం ఇచ్చారు. తుంగభద్ర కుడి కాలువ (ఎల్లెల్సీ) పొడవు 3492 కిలోమీటర్లు, నీటి సామర్థ్యం 1800 క్యూసెక్కలు, కర్నాటకలో 37,503 హెక్టార్లకు, ఆంధ్రలో 63,522 హెక్టార్లకు నీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. 250 కిలోమీటర్ల వరకు బోర్డు పరిధిలో కాలువ ఉంటుంది. తుంగభద్ర ఎగువ కాలువ హెచ్‌ఎల్‌సీ మొత్తం పొడవు 186.7 కిలోమీటర్లు ఉండగా 105,43 మీటర్లు బోర్డు పరిధిలోకి వస్తుంది. కాలువ నీటి సామర్థ్యం 4 వేల క్యూసెక్కులు. కర్నాటకలో 80,908 హెక్టర్లు, ఆంధ్రలో 76,937 ఎకరాలకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టారు. అలాగే ఎడమ కాలువ 204 కిలోమీటర్లు ఉంది. ఈ కాలువ కొప్పళ్ళ, రాయచూరు జిల్లాలకు నీటిని అందిస్తుంది. ఈకాలువ నీటి సామర్థ్యం 4,100 క్యూసెక్కులు, 2,43,900 హెక్టర్లకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం, ఎడమ కాలువ కింద హెచ్‌ఎల్‌సీ కాలువ పొడవు 12 కిలోమీటర్లు, నీటి సామర్థ్యం 33 క్యూసెక్కులు. 468 హెక్టార్లు సాగులోకి తేవాలన్నదే లక్ష్యం. అలాగే కుడి, ఎడమ కాలువలపై రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.