ఆంధ్రప్రదేశ్‌

బాబు పాలనలోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మార్చి 18: ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలోనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని పంచాంగకర్తలు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటారని, రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందుతుందని వివరించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకట్రావ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కళావెంకట్రావ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో నవ్యకాంతులు నింపి, ప్రతి లోగిలిలో సంతోషం వెల్లివిరియాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉన్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి ఎలాంటి అవరోధాలు ఉండవని, మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు అహరహం శ్రమిస్తున్నారని, నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం, పోలవరం, భారీ నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేసే దిశగా ప్రణాళిక రూపొందించారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్సీలు వీవీవీ చౌదరి, ఏఎస్ రామకృష్ణ, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ జయరామిరెడ్డి, టీడీపీ నాలెడ్జి సెంటర్ కోఆర్డినేటర్ మాల్యాద్రి, కార్యాలయ కార్యదర్శి ఎవి రమణ, నరేంద్ర పాల్గొన్నారు.