ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ తెరపైకి దొనకొండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 18: ‘‘రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం.. ఆ వెంటనే అమరావతి నుంచి రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు మార్చడం తథ్యం’’ అన్న ప్రచారం రాయలసీమ జిల్లాల్లో జోరందుకుంది. 2014 ఎన్నికలకు ముందు దొనకొండ రాజధాని అవుతుందని ప్రచారం జరగడంతో జగన్ సీఎం అవుతారని నమ్మిన అనేక మంది దొనకొండ ప్రాంతంలో పెద్దఎత్తున భూములను కొనుగోలు చేశారు. ఎన్నికల అనంతరం ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారి చంద్రబాబు సీఎం పీఠాన్ని అధీష్టించడంతో అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ మేరకు పనులు ప్రారంభించారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తిరిగి సీఎం కాలేరని వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో విశ్వసిస్తున్నారు.
జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సారవంతమైన భూముల్లో రాజధాని నిర్మించడం తగదని అక్కడి భూములు ఆ ప్రాంత రైతులకు అప్పగించి దొనకొండ సమీపంలోని అటవీ భూములు, సాగునకు వీలు కాని భూముల్లో రాజధాని నిర్మిస్తామని ప్రకటించనున్నారని ప్రచారం సాగుతోంది. దాంతో దొనకొండ ప్రాంతంలో భూముల కొనుగోలుకు ఇప్పటికే కొందరు రంగం సిద్ధం చేసుకోగా మరి కొందరు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో 100కు పైగా శాసనసభ, సుమారు 20 లోక్‌సభా స్థానాల్లో వైసీపీ విజయం సాధించనుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఒకవేళ కాస్త తగ్గినా బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో జగన్ అధికారంలోకి వస్తారని వారు వెల్లడిస్తున్నారు. టీడీపీ, బీజేపీల మధ్య రెండేళ్ల క్రితమే మనస్పర్థలు వచ్చాయని దాని వల్లే కేంద్రం నుంచి సరైన సహకారం లభించలేదని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఆనాడే చంద్రబాబు బీజేపీతో బంధం తెంచుకుని ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఉంటే వైసీపీ పరిస్థితి ఇప్పుడు అనుకుంటున్న విధంగా ఉండేది కాదని వారు వెల్లడిస్తున్నారు. కేంద్రం నుంచి సహాయ నిరాకరణ ఎదురుకావడం, ఖర్చులు పెరగడంతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడ్డారని వారంటున్నారు. చివరకు ఎన్డీఏతో చెలిమిని దూరం చేసుకోవాలని నిర్ణయం తీసుకునే లోపు ప్రజల్లో వైసీపీకి అనుకూలంగా మార్పు వచ్చిందని వారంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించే బీజేపీ కూడా రాష్ట్రంలో జగన్‌తో స్నేహానికి సిద్ధమైందని స్పష్టం చేస్తున్నారు. రాజధాని అమరావతికి అనంతపురం నుంచి నిర్మించే రహదారికి భూ సేకరణకు రైతులు అంగీకరించవద్దని వైసీపీ నేతలు అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు సూచిస్తున్నారు. ఎన్నికల అనంతరం రహదారి మార్గం మారుతుందని అమరావతికి కాకుండా దొనకొండకు ఏడాదిలోగా కొత్త రహదారి నిర్మాణం పూర్తవుతుందని వారు సూచిస్తున్నట్లు కొందరు రైతుల ద్వారా తెలిసింది. అనంతపురం నుంచి దొనకొండ మార్గానికి రహదారి వేస్తే మార్గం మారి మరో ప్రాంతంలో రైతుల భూములు సేకరించాల్సి ఉంటుందని వారు చెబుతున్నట్లు రైతులు వెల్లడించారు. దొనకొండలో రాజధాని నిర్మాణం ప్రారంభిస్తే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ భవనాలు, శాసనసభ, మండలి, హైకోర్టు భవనం, సచివాలయం, పాలకులు, అధికారుల నివాస గృహాలకు ఖర్చయ్యే మొత్తం 3 విడతల్లో విడుదల చేస్తామని బీజేపీ నేతలు వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి హామీ ఇచ్చినట్లు ఒక వైసీపీ నేత తెలిపారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణలతో ఏది నమ్మాలో దేన్ని నమ్మకూడదో తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.