ఆంధ్రప్రదేశ్‌

వెండి రథంపై ఊరేగిన దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) మార్చి 18: తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆదివారం వెండి రథంపై ఊరేగించారు. మల్లికార్జున మహామండపం ప్రక్కన వివిధ రకాల పుష్పాలతో రథాన్ని అందంగా అలకరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను రథంలో కొలువుతీర్చారు. స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ఇవో ఎం పద్మ, కమిటీ చైర్మన్ వై గౌరంగబాబు, తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై దుర్గా భవానీ.. అంటూ భక్తులు నినాదాలు చేస్తుండగా అమ్మవారి వెండి రథం బయలుదేరింది. అక్కడ నుండి రథం సెంటర్ మీదుగా బ్రాహ్మణ వీధి, రామాలయం సెంటర్, పోస్ట్ఫాస్ సెంటర్, నగరాల రామాలయం మీదుగా కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్‌కు చేరుకుంది. తిరిగి కేటీ రోడ్, కోమల విలాస్ సెంటర్, రమణయ్య కూల్ డ్రింక్స్ షాప్ సెంటర్, సామారంగ్ చౌక్ సెంటర్ మీదుగా పార్కు రోడ్‌లోకి ప్రవేశించింది. అక్కడ నుండి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, వస్తల్రత, కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా కెనాల్ రోడ్‌లో ప్రవేశించి వినాయకుడి గుడి, రథం సెంటర్ మీదుగా తిరిగి బయలుదేరిన చోటుకు చేరింది. అమ్మవారి రథయాత్ర కోలాహలంగా సాగింది. ప్రతి సెంటరులో అమ్మవారి వెండి రథానికి భక్తులు ఘన స్వాగతం పలికారు. ఉగాది సందర్భంగా ఆదివారం వేకువజాము నుండే అమ్మవారి సన్నిధికి భక్తులు బారులుతీరారు. ఆదివారం ఒక్కరోజులో 75వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. చైత్రమాసం, నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారికి పుష్పార్చన ప్రారంభించారు. తొలిరోజు 11మంది ఉభయదాతలు పాల్గొన్నారు. మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో ఉగాది సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితుడు తంగిరాల వెంకటకృష్ణ పంచాంగ పఠనం చేశారు. నగరానికి చెందిన పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దేవస్థానం సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడు, కమిటీ సభ్యులు వెలగపూడి శంకరబాబు, పద్మశేఖర్, బడేటి ధర్మారావు పర్యవేక్షించారు.