ఆంధ్రప్రదేశ్‌

భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం స్వామివారి వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉగాదిని పురస్కరించుకుని ముందుగా మూలవరులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి స్వామిని నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచాంగాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఆస్థాన పురోహితులు పంచాంగ శ్రవణం చేశారు. భద్రాద్రి రామయ్యకు ఆదాయం 8 ఉండగా, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉన్నాయని పంచాంగకర్తలు తెలిపారు. సీతమ్మ వారికి ఆదాయం 4, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26న సీతారాముల కల్యాణోత్సవం జరపనున్నారు. ఈ ఉత్సవానికి రావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లను దేవస్థానం తరపున ఆహ్వానించారు. ఉగాదిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లో వారిద్దరికీ రాజపత్రంతో అధికారికంగా ఆహ్వానం అందజేశారు.