ఆంధ్రప్రదేశ్‌

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పినపాక, మార్చి 18: గిరిజన బాలికపై మానవ మృగాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పినపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన 13ఏళ్ల బాలిక స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. దారిలో మరికొందరు యువకులను ఆటోలో ఎక్కించుకుని నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారం క్రితం జరిగిన ఈ దారుణం బాలిక ద్వారా ఆలస్యంగా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
బెడిసికొట్టిన పంచాయితీ?
వారం రోజుల క్రితం జరిగిన ఈ దారుణంపై పాండురంగాపురం, అమరవరం గ్రామాలకు చెందిన పెద్దమనుషులు చేసిన పంచాయితీ బెడిసికొట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పెద్దమనుషులు బాలిక శీలానికి వెలకట్టి నిందితులతో రాజీ చేసే ప్రయత్నం చేయగా బాధిత బాలిక బంధువులు ఎదురుతిరగటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులకు ఫిర్యాదు కూడా ఆలస్యంగా చేసినట్లు తెలిసింది.