ఆంధ్రప్రదేశ్‌

రైలు పట్టాలపై పడిన విద్యుత్ స్తంభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైళ్ల రాకపోకలకు అంతరాయం
గిద్దలూరు, మార్చి 18: ప్రకాశం జిల్లాలో శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట, చలమ రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు పట్టాలపై విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రైలు పట్టాల వెంబడి ఇటీవల ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటలకు రావాల్సిన గుంటూరు ప్యాసింజర్ రైలు గాజులపల్లిలో, కాచిగూడ రైలును దిగువమెట్టలో నిలిపివేశారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు విద్యుత్ స్తంభాలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.