ఆంధ్రప్రదేశ్‌

నయనానందకరం మల్లన్న రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, మార్చి 18: ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం శ్రీశైలంలో తెలుగు సంవత్సరాది పర్వదినం పురస్కరించుకుని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల రథోత్సవం నయనానందకరంగా సాగింది. లక్షలాది మంది కన్నడ భక్తుల మధ్య ప్రధాన మాడవీధుల్లో సాగిన మల్లన్న రథోత్సవం ఆద్యంతం అలరించింది. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి పల్లకిలో ఊరేగింపుగా రథశాల వద్దకు తీసుకొచ్చి రథంలో కొలువుదీర్చారు. అనంతరం రథోత్సవం తూర్పు మాడ వీధుల గుండా సాగి గంగాధర మండపం చేరుకుంది. దారి పొడవునా భక్తులు నీరాజనాలు అర్పించారు. ఉత్సవ సేవల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో అమ్మవారు రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం పూర్ణాహుతి, వసంతోత్సవం, సాయంత్రం స్వామి వార్లకు అశ్వవాహన సేవ, అమ్మవారికి నిజ అలంకరణ సేవ జరుగుతాయి. విలంబి నామ సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని శ్రీశైలం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత వీరభద్ర దైవజ్ఞ తెలిపారు.