ఆంధ్రప్రదేశ్‌

హోదా మలిదశ ఉద్యమం హోరెత్తాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రత్యేక హోదా మలిదశ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా హోరెత్తేలా నిర్మిద్దామని, ఢిల్లీకి పెద్ద షాక్‌గా ఆ ఉద్యమం నిలవాలని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర నేత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యాన విజయవాడలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల నుంచి రాజకీయ శ్రేణులు, ప్రత్యేక హోదా సాధన సమితి, విద్యార్థి, యువజన, మేధావులు, న్యాయవాదులు తదితర సంఘాల నుంచి 35 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రామకృష్ణ ప్రసంగిస్తూ ఇది రాష్ట్ర సమస్య కాదనీ, జాతీయ సమస్యగా మారిందని స్పష్టం చేశారు. నాలుగేళ్ల నుంచి రాష్ట్రానికి బీజేపీ నేతలేం చేశారో స్పష్టం చేశారు. మలిదశ ఉద్యమం ఒక ఉప్పెనలా కొనసాగాలని, ఢిల్లీలోని ప్రతి గల్లీకి సెగ తగిలేలా ఉద్యమించాలని సూచించారు. రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లోనూ నిరసనలు ఉద్ధృతం కావాలని, రైళ్లు, విమానాలను నిలిపేసేలా ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబునాయుడుకు ప్రత్యేక హోదాపై మమకారం ఉంటే ఈ ఉద్యమానికి సహకరిస్తారా? లేక అడ్డుకుంటారా? అనేది తేల్చుకోవాలని సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ అన్ని పట్టణాల్లో విద్యార్థి, యువజన సంఘాలతో కలిపి ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీలను వేగవంతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన నగరాల్లో బహిరంగ సభలు, నిరసనలు, ప్రదర్శనలతో ఉద్యమ దిశాదశను మార్చాలన్నారు. బస్సు యాత్రలు, బంద్‌లతో కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచుదామని చెప్పారు. పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడుతూ విభజన చట్టం ఆధారంగా రాష్ట్రానికి రూ.50 లక్షల కోట్లు రావాల్సి ఉండగా, రూ.11,677 కోట్లు వచ్చాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిన్నా, మొన్న ఢిల్లీలో నిర్వహించిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తీర్మానించామన్నారు. సాధన సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా మలిదశ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా ఏకం కావాలని సినీ నటుడు శివాజీ పిలుపిచ్చారు. తాను ప్రాణత్యాగానికి సిద్ధమని చెప్పారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన హోదా హామీని బీజేపీ ప్రభుత్వం అమలు చేయకపోవడం విచారకరమన్నారు. బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ బంద్‌లు, ఆందోళనలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థి సంఘాలతో జేఏసీలను ఏర్పాటుచేసి ఉద్యమంలో వారిని భాగస్వాముల్ని చేయాలని కోరారు. ప్రొఫెసర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి సంఘాల నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతున్న విధానాలు బాధాకరమన్నారు. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు కృష్ణాంజనేయులు మాట్లాడుతూ వెంటనే ఉద్యమానికి కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనసేన పార్టీ నాయకుడు అద్దేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్‌లో అధికార పార్టీతోపాటు అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఐక్యంగా హోదా కోసం మలిదశ ఉద్యమాన్ని నిర్మించాలని సూచించారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాకుంటే యువత తీవ్రంగా నష్టపోతుందని వాపోయారు. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు హరినాథ్ మాట్లాడుతూ మనలో ఉన్న అనైక్యతలను విడనాడి హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు వి బాబ్జీ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ హోదా ఉద్యమం మలిదశకు వచ్చిందన్నారు. సమావేశానికి ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేత, విజయవాడ సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ స్వాగతోపన్యాసం చేశారు.