ఆంధ్రప్రదేశ్‌

ఈతకెళ్లి ఆరుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచర/్లకొత్తగూడెం, మార్చి 19: రెండు తెలుగురాష్ట్రాల్లో సోమవారం ఈతకెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాలో ఇద్దరు, బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లా రొంపిచర్లకు చెందిన పామిశెట్టి కోటేశ్వరరావుకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా భర్తతో పాటు చెన్నైలో ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కుమారులు ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఉగాది సందర్భంగా అందరూ శనివారం రొంపిచర్ల వచ్చి పండుగను వేడుకగా జరుపుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో గ్రామ సమీపంలోని తంగెడుమల్లి మేజర్ కాలువకు సమీప బంధువైన వేణుతో కలిసి ఈతకు వెళ్లారు. కాలువలో డ్రాపు సమీపంలో ఈతకు దిగిన నరసింహారెడ్డి(28) నీటి సుడిలో చిక్కుకున్నాడు.
ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఇది గమనించిన అతని బావమరిది వీరబ్రహ్మం(22) ఆదుర్దాగా నీటిలోకి దిగాడు. వీరబ్రహ్మం సైతం ఈత రాకపోవడంతో సుడిలో చిక్కుకున్నాడు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన వేణు వీరి పరిస్థితిని గమనించి అతికష్టంగా ఒడ్డుకు చేరుకున్నాడు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో గ్రామంలోకి వచ్చి ప్రమాదం సంగతిని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెళ్లేటప్పటికే నరసింహారెడ్డి మృతి చెందాడు. వేణుని కూడా బయటకు తీయగా కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించిన బంధువులు చికిత్స కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సమీపంలోని పాయమ్మ చెరువుకు సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఒంటిపూట బడి ముగిసిన తరువాత ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి లావుడ్యా సౌజన్య(13), ఏడో తరగతి చదువుతున్న భూక్యా సిద్దూ(12), తొమ్మిదో తరగతి విద్యార్థి బాణోత్ సంతోష్(14), ఎనిమిదో తరగతి చదువుతున్న బాణోత్ దిలీప్(12) చెరువులో మునిగి అక్కడికక్కడే మృతిచెందారు. గొర్రెల కాపారులు మధ్యాహ్నం ఈ సమాచారం తెలియజేయడంతో సంఘటనా స్థలానికి పోలీసులు, గ్రామస్థులు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది.