ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం విక్రయం ద్వారా రూ.1231 కోట్లు: శిద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ బేస్ క్యాంప్స్ ఆర్మ్‌డ్ బేస్ క్యాంప్స్, స్ట్రైక్ ఫోర్సెస్, చెక్‌పోస్టుల్లో ఈ-నిఘా ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 2004-2011 సంవత్సరం వరకు 3816 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 69.7 కోట్లు మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శకంగా అంతర్జాతీయ టెండర్లను పిలిచి 5252.837 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయం ద్వారా 1231.409 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.అటవీ చట్టాలను పటిష్ఠంగా అమలుపరుస్తున్నామన్నారు.