ఆంధ్రప్రదేశ్‌

బోయలను ఎస్టీల్లో చేర్చవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 20: రాష్ట్రంలోని బోయ కులస్థులను ఎస్టీల్లో చేర్చడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో గత కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తున్న గిరిజన జేఏసీ మంగళవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సమావేశాలను అడ్డుకునే ప్రయత్నంలో అసెంబ్లీ ముట్టడికి గిరిజన జేఏసీ నేతృత్వంలో నేతలు ప్రయత్నించారు. దీనిపై ముందుగానే స్పందించిన పోలీసులు వారిని సచివాలయం వద్దనే అడ్డుకున్నారు. అసెంబ్లీ ప్రాంతంలోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన గిరిజన నేతలు కొంతసేపు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చివరకు గిరిజన జేఏసీ నేతలను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.