ఆంధ్రప్రదేశ్‌

నా మాటలను వక్రీకరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 20: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీతో పాటు హోదా కూడా తప్పని సరిగా కావాల్సిందేనని, ఇందులో రాజీపడే ప్రసక్తేలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఏపీకి తక్షణ సహాయం కావాలని, అది హోదానా.. ప్యాకేజీనా.. అన్నది పెద్ద విషయం కాదని పవన్‌కళ్యాణ్ ఒక టీవీ చానల్ ఇంటర్వూలో చెప్పినట్టుగా వచ్చిన వార్త రాష్టవ్య్రాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా దీనిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం రావాలసిన నిధులు, ఎక్సైజ్ సుంకం రానప్పుడు ప్రత్యేకహోదాతో ఉపయోగమేమిటని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు ఆయన తెలిపారు. కొందరు తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారన్నారు. నిధులు, హోదా రెండూ కావాలన్నదే జనసేన పార్టీ ప్రధాన డిమాండ్‌గా తెలిపారు.