ఆంధ్రప్రదేశ్‌

అది రాజకీయ ఆత్మహత్య లాంటిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: అవిశ్వాసం నుంచి తప్పించుకోవడమంటే అది రాజకీయ ఆత్మహత్య లాంటిందేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సభలో అవిశ్వాసంపై నోటీసు వస్తే తిరస్కరించే అధికారం స్పీకర్‌కు లేదని స్పష్టం చేశారు. సభ సజావుగా లేదని తిరస్కరించడం స్పీకర్‌కు తగదని సూచించారు. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. అవిశ్వాసం చర్చకు చేపట్టకపోతే అది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధమని తెలిపారు. లోక్‌సభలో పరిణామాలన్నీ గత చరిత్రకు భిన్నంగా ఉన్నాయన్నారు. వెల్‌లో ఆందోళన చేసే అన్నాడీఎంకే బీజేపీ మిత్రపక్షమే కదా? అవిశ్వాసం నుంచి తప్పించుకునేందుకే మిత్రపక్షాలతో ఆందోళన చేయిస్తోందని ఆరోపించారు. అవిశ్వాసం నుంచి కేంద్రం పారిపోతోంది అనడానికి ఇది నిదర్శనంమంటూ ఎద్దేవా చేశారు.