ఆంధ్రప్రదేశ్‌

కల కాదు..నిజమే చెప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 21: పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించాల్సిన పోలవరం ప్రాజెక్టు వ్యయంలో నిర్వాసితుల పునరావాసానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్న అంశానే్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎత్తిచూపారని, ఈ విషయాన్ని పవన్‌కళ్యాణ్ కలగన్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. 2019 నాటికి కాఫర్‌డ్యాం నిర్మాణం పూర్తయ్యేనాటికి భూసేకరణ, పునరావాస వ్యయం ఎలా భరిస్తారని కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్నకు తాము ఏర్పాటుచేసుకుంటామని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సమాధానమిచ్చారన్నారు. అందుకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టిన పత్రాలను ఉండవల్లి విలేఖర్లకు చూపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. పోలవరం నిపుణుల కమిటీ, ఇరిగేషన్ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో చర్చించి నమోదు చేసిన మినిట్స్‌నే పవన్‌కళ్యాణ్ ఉటంకించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఒకవేళ ఆ అధికారి పేర్కొన్నది అవాస్తవమైతే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై తాను అధికార్లకు నోటీసు ఇచ్చానని, వారంలోగా వివరణ ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. భూసేకరణ, పునరావాసం కోసం అయ్యే రూ.33వేల కోట్ల వ్యయాన్ని ఎవరు భరిస్తారని ఆయన ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం నిర్మాణ బాధ్యతను చంద్రబాబు కోరితే, కేంద్రం నీతి ఆయోగ్‌కు నివేదించిందని, తదనంతరం నీతి అయోగ్ సిఫార్సు మేరకు మాత్రమే నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి అప్పగించారని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే దీనిపై అసెంబ్లీలో మాత్రం కేంద్ర ప్రభుత్వమే ఈబాధ్యతను రాష్ట్రానికి అప్పగించిందని ముఖ్యమంత్రి పదేపదే చెప్పడం విడ్డూరమన్నారు. నవయుగ ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతున్నారన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం అథారిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇప్పటివరకు అధికారికంగా అవగాహన ఒప్పందం కూడా కుదరలేదన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏనాడు నిజాలు చెప్పడం లేదన్నారు. పోలవరంను ముట్టుకుంటే కాలిపోతారన్న చంద్రబాబునాయుడు తానే కాలిపోయే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. పోలవరం భూసేకరణ, పునరావాసం విషయంలో భారీ అవినీతి జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు. జీలుగుమిల్లి మండలంలో 1300 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని రైతుల భూమిగా చూపించారని, అనర్హులకు పరిహారం చెల్లించారని, రికార్డుల్లో పేర్లు లేని వారికి కూడా పరిహారం చెల్లించారని ఉండవల్లి ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొందరు అధికార్లకు కోట్ల రూపాయలు ముట్టాయాన్నారు.
అధికారపక్షం తల్చుకుంటే అవిశ్వాసంపై చర్చ
రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపై టీడీపీ, వైసీపీ ఎంపిలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందిస్తూ అధికారపక్షం తలుచుకుంటే తీర్మానంపై చర్చించవచ్చన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇదే పరిస్థితి ఉన్నా నాటి స్పీకర్ మీరాకుమార్ విభజన తీర్మానాన్ని ఆమోదింపజేశారని గుర్తుచేశారు. స్పీకర్ తలుచుకుంటే పార్లమెంటు వెల్‌లోకి వెళ్లిన వారిని సస్పెండ్ చేయవచ్చన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఎవరికీ చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు.