ఆంధ్రప్రదేశ్‌

నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడా పోరాటం? టీడీపీని నిలదీసిన సీపీఎం ప్రధాన కార్యదర్శి మధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 21: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోగా, విభజన హామీలు అమలు కాలేదని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ మధు ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం సీపీఎం ఆధ్వర్యాన విశాఖలో తలపెట్టిన మహాపాదయాత్రను బుధవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగి, ఇప్పుడు బీజేపీ హోదా ఇవ్వలేదంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎన్నికల్లో పోటీచేసి, హోదా కంటే ప్యాకేజీ లాభదాయకమంటూ మాటమార్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా ఇవ్వాలంటూ కొత్త నాటకానికి తెరతీరని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం గత నాలుగేళ్లుగా ఉద్యమిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించిన ప్రభుత్వం, ఇప్పుడు తానే హోదా ఉద్యమం అంటూ ప్రజలను మభ్యపెడుతోందన్నారు.
పొత్తు కోసం హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు తీరును విమర్శిస్తోంటే వైసీపీ, జనసేన పార్టీలను బీజేపీ కోవర్టులుగా పేర్కొనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఎన్ని కుప్పిగంతులేసినా చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఒంటరైపోయాయన్నారు. ప్రత్యేక హోదాపై ఎన్‌డీఏపై అవిశ్వాస తీర్మానం నోటీసులిస్తే, కనీసం చర్చకు కూడా అనుమతించకుండా బీజేపీ నియంతృత్వ పోకడలను అనుసరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ ఉద్యమాన్ని చేపట్టామన్నారు. దీనిలో భాగంగా సీపీఎం మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య రహదారుల దిగ్బంధం ఉంటుందన్నారు. విభజన హామీల సాధన సమితి ప్రతినిధి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు నియంతృత్వ, అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.