ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం కూసాలు కదిలేలా ‘హైవేల దిగ్బంధం’ ప్రభుత్వం కూడా సహకరించాలి* వామపక్ష నేతల పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: ప్రత్యేక హోదా, విభజనాంశాల అమలు కోసం గురువారం రాష్టవ్య్రాప్తంగా జరిగే జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రజలంతా ఉప్పెనలా తరలి వచ్చి కేంద్రం కూసాలు కదిలించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావులు పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించి ఆంధ్రులంతా ‘ఒన్ వాయిస్’ అనేలా కేంద్రానికి సంకేతానివ్వాలన్నారు. గత నెల ఫిబ్రవరి 8వ తేదీ నిర్వహించిన రాష్ట్ర బంద్ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ సహకరించడంతో ప్రత్యేక హోదా ఉద్యమం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజనాంశాల అమలుపై రాష్ట్రంలో ఉద్యమం తీవ్రమైన దగ్గర నుండి పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చకు రానీవ్వకుండా బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. చివరకు అవిశ్వాస తీర్మానం సైతం నాలుగు రోజులుగా చర్చకు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్ సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా కేసీఆర్‌కు తోటి తెలుగువారి పట్ల ఏ మాత్రం అభిమానం వున్నా అవిశ్వాస తీర్మానంపై చర్చకు సహకరించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఏపీ పట్ల బీజేపీ ప్రభుత్వం పూర్తి వివక్ష చూపుతోందన్నారు. రైల్వేజోన్ కోసం ఇక్కడ పెద్దఎత్తున ఉద్యమం చేస్తుంటే దానిపై స్పందించకపోగా గతంలో నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి పలు రైళ్లను రద్దు చేసే సాహసానికి ఒడిగట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ప్రధాని మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న టీడీపీ ఆరోపణలపై ప్రశ్నించగా అది కేవలం తెలుగుదేశం నేతలు కలవరపాటుకి గురికావడం తప్ప అందులో విషయం ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజనాంశాల అమలు కోసం జరిగే ఉద్యమానికి దూరంగా ఉంటున్న బీజేపీ శ్రేణులను వెలివేయాలని రాష్ట్ర ప్రజలకు రామకృష్ణ పిలుపునిచ్చారు.