ఆంధ్రప్రదేశ్‌

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 21: ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. శాసనసభలో బుధవారం వ్యవసాయంపై లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకత గతంలో కంటే గణనీయంగా పెరిగిందన్నారు. 2017-18లో వ్యవసాయంలో 17.66 శాతం, ఉద్యానవన పంటలలో 18.62 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రత్యామ్నాయ పంటలు, సూక్ష్మ పోషకాలను రైతులకు అందించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 37.06 లక్షల హెక్టార్లలో సాగు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటి వరకు 3వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు అందించామన్నారు. కౌలురైతులకు రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో వ్యవసాయాభివృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ఇందులో భాగంగానే ఈ ఏడాది 19వేల 70 కోట్ల అంచనాతో బడ్జెట్ రూపొందించామని వివరించారు. గిట్టుబాటు ధరలేని సమయాల్లో ప్రభుత్వం మద్దతు ధర కల్పించి రైతుల్ని ఆదుకుందన్నారు. రాష్ట్రం మొత్తంగా 2వేల 187 కోట్లతో విత్తనాలు రైతులకు పంపిణీ చేశామన్నారు. యాంత్రికీకరణకు 450 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టుపురుగుల పెంపకానికి రెండు ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు. రైతులు నష్టపోకుండా 500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యవసాయంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక, ప్రశ్నించలేక ప్రతిపక్షం పరారైందని మంత్రి విమర్శించారు.
ఊరూరా పశుగ్రాస కేంద్రాలు: మంత్రి ఆదినారాయణరెడ్డి
పాడి, పశువుల పెంపకంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ముద్ర పథకం ద్వారా పాడిపశువుల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణాలు అంద జేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపులు అసమగ్రంగా ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం గ్రామ గ్రామాన పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం రాయతీలతో ఆదుకుంటోందని వ్యాఖ్యానించారు.